ప్రియాంక పుకార్ల‌కే ప‌రిమిత‌మా…?

టాక్సీవాలా సినిమాతో హీరోయిన్‌గా మారిన ప్రియాంక జవాల్కర్ ఆ సినిమా విడుదలైన తర్వాతే వేరే సినిమాలు ఒప్పుకోవాలనే కాన్సెప్ట్‌తో దాదాపు ఏడాదిగా ఖాళీగా ఉండిపోయింది. అయితే అంతగా ఎదురుచూసిన టాక్సీవాలా విడుదలై, ప్రాఫిటబుల్ వెంచర్ అనిపించుకున్నప్పటికీ, ప్రియాంకకి మాత్రం అంత పేరు ప్ర‌ఖ్యాత‌లు ఏమీ రాలేదు.

ఈ సినిమా విషయంగా క్రెడిట్ మొత్తం విజయ్ దేవరకొండ కొట్టేయడంతో, ప్రియాంక వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. టాక్సీవాలా రిలీజైన వెంటనే రవితేజ, ప్రియాంకని పిలిచి మరీ అవకాశం ఇచ్చాడంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. అయితే, డిస్కో రాజా నటీనటుల జాబితాలో ప్రియాంక జవాల్కర్ పేరు లేదు. ఆ తర్వాత గోపీచంద్, నాగచైతన్య సినిమాలలో కూడా ఈమెను హీరోయిన్‍‌గా తీసుకోబోతున్నారంటూ పుకార్లు వచ్చాయి. ఆ సినిమాలకు కూడా వేరే హీరోయిన్‌లను తీసేసుకున్నారు.

ఇక ఇటీవలి కాలంలో అఖిల్ సరసన ప్రియాంక అంటూ కొత్తగా కథనాలు వినిపించాయి. గీతా ఆర్ట్స్-2 బ్యానర్‌లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ చేయబోయే సినిమాలో ప్రియాంక జవాల్కర్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారంటూ స్టోరీలు వినిపించినప్పటికీ అలాంటిదేమీ లేదని తేలిపోయింది.

ఇలా ఈ భామ టాక్సీవాలా తర్వాత పూర్తిగా పుకార్లకే పరిమితమైపోయి, అఫీషియల్‌గా ఒక్క సినిమాకి కూడా నోచుకోలేకపోయింది. మరి ఆవిడ తదుపరి సినిమా ఎప్పుడు, ఎవరితో సెట్స్ పైకి వస్తుంది అనేది కాలమే నిర్ణయించాలి.

Leave a Reply

Your email address will not be published.