సొంత నిర్మాణం లో నటిస్తున్న విష్ణు మంచు …

విష్ణు మంచు త‌నే హీరోగా న‌టిస్తూ,  సొంత నిర్మాణ సంస్ద‌పై తెర‌కెక్కిస్తున్న చిత్రానికి   మోస‌గాళ్ళు అని పేరు ఖ‌రారు చేసారు. హాలీవుడ్ ద‌ర్శ‌కుడు జెఫ్రీ గీ చిన్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి  ఓ కీల‌క భూమిక పోషిస్తున్నాడు.  ప్ర‌స్తుతం విష్ణు మంచు, సునీల్ శెట్టి మ‌ధ్య భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ని  హాలీవుడ్ యాక్ష‌న్ నిపుణుల ఆధ్వ‌ర్యంలో.. హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్‌లో తెర‌కెక్కిస్తున్నారు.  ఈ స‌న్నివేశం కోసం ఇద్ద‌రు స్టార్స్ ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను కూడా తీసుకోవ‌టం విశేషం. 
తెలుగు తెర‌పై ఇప్ప‌టివ‌ర‌కు రాన‌టువంటి క‌థాంశాన్ని  మోస‌గాళ్ళు లో ఉంటుంద‌ని, చిత్రంలో యాక్ష‌న్ సీన్ల‌న్నీ ప్రేక్ష‌కుల‌న ఆక‌ట్టుకునేలా ఉంటాయ‌ని విష్ణు మంచు మీడియాకు చెప్పారు.  ఈ చిత్రంలో ఇతర పాత్ర‌ల‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర‌, రూహి సింగ్ త‌దిత‌రులు న‌టిస్తుండ‌గా , నిర్మాణంత‌ర కార్య‌క్ర‌మాలు ఓ వైపు జ‌రుగుతున్నాయ‌ని,  శ‌ర‌వేగంతో సినిమాని పూర్తి చేసి  వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని విష్ణు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.