నవ్వు విలువేంటో తెలిసింది! – అనీల్ రావిపూడి

విక్టరీ వెంకటేష్- తమన్నా, వరుణ్ తేజ్- మెహరీన్ నాయకానాయికలుగా దిల్రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన్ప అనీల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన చిత్రం ఎఫ్ 2. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనేది ఉపశీర్షిక. సంక్రాంతి  కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్ లో దర్శకుడు అనీల్ రావిపూడి మాట్లాడుతూ  ఈ సంక్రాంతికి ఎస్.వి.సి బ్యానర్‌లో మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దిల్‌రాజుకి, శిరీష్‌కి, లక్ష్మణ్‌కి థాంక్స్. స్క్రిప్ట్ దశ నుండి నాకు సపోర్ట్ చేసిన నా టీంకు థాంక్స్. తమ్మిరాజు ఎడిటింగ్‌లో ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. సమీర్ రెడ్డిగారు సినిమాను అద్భుతంగా, అందంగా చూపించారు. ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్ మాస్టర్ వెంకట్‌కి థాంక్స్. నటీనటుల విషయానికి వస్తే ప్రకాష్‌రాజ్‌కి, రాజేంద్రప్రసాద్‌కి, ప్రగతి, ఝాన్సీ, అన్నపూర్ణమ్మ ఇలా అందరూ లైఫ్ పెట్టి పనిచేశారు. తమన్నా, మెహరీన్లకు నా స్పెషల్ థాంక్స్. మంచి ట్యూన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్‌కి థాంక్స్. వెంకీ, వరుణ్ కామెడీ హైలైట్. తనతో మరచిపోలేని ప్రయాణం. ఇంకా మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఎన్నాళ్లు నుండి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ఈ సినిమా సక్సెస్ చూస్తుంటే అర్థమవుతుంది. నాపై నమ్మకంతో సినిమా చేసినందుకు వెంకటేష్‌కి థాంక్స్. కామెడీ చేయడంలో వెంకటేష్‌కి మనం చెప్పేదేముండదు. ఆయనొక లైబ్రరీ. అందులో ఏరుకోవడమే. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరి జీవితంలో నవ్వుకున్న ప్రాముఖ్యత ఏంటో అందరికీ తెలుసు. నవ్వును మేం ఇచ్చినందుకు మీరు నవ్వుతూ కలెక్షన్ల వర్షం కురిపించినందుకు థాంక్స్. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో 30, 40 శాతం మాత్రమే నవ్వించాం. ఈ సినిమాలో వంద శాతం నవ్వించే ప్రయత్నం చేశాం. ఆ నవ్వు విలువేంటో ఈ సంక్రాంతికి తెలిసింది. నా లైఫ్లో ఈ సంక్రాంతి నవ్వుల సంక్రాంతి. జీవితాంతం గుర్తుండిపోయే సంక్రాంతి” అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ సినిమాకు ఎఫ్ 2 అనే టైటిల్ ని ప్రకటించి వీ 2 (వెంకటేష్, వరుణ్‌తేజ్)గా ఇద్దరు హీరోలు జాయిన్ అయ్యారు. సినిమా ఈ2(ఎంటర్టైన్మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్) అని మెసేజ్‌లు పెట్టారు. చివరకు బీ 2 (బొమ్మ బ్లాక్‌బస్టర్) అనేశారు. మా బ్యానర్లో ఇది 31వ సినిమా. ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ చేసిన అనీల్‌కు థాంక్స్. మా టీం అందరం ఎంజాయ్ చేస్తున్నాం. వెంకటేష్, వరుణ్ అద్భుతంగా చేశారు. అనీల్కు స్క్రిప్ట్ ప్రారంభం నుండి సపోర్ట్ చేస్తున్న సాయి, నారాయణ సహా అందరికీ థాంక్స్. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశ నుండి హిట్ అనే చెబుతూ వచ్చారు. సినిమా వెనుకాల చాలా మంది ఉన్నారు.నటీనటులు, టెక్నీషియన్లకు థాంక్స్.  తొలి నుంచి సినిమా హిట్ అవుతుందనే అనుకున్నాం కానీ.. ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. కొంచెం నవ్విస్తే చాలు.. బ్రహ్మారథం పడతారని ప్రేక్షకులు నిరూపించారు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో వెంకటేష్ 50 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యారు. ఫిదాతో వరుణ్ 50 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యారు. ఇద్దరికీ కలిపి ఈ సినిమా 50 కోట్ల సినిమా అయ్యింది. అనీల్ మూడు సక్సెస్ సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమా సక్సెస్ కిక్ తనకు మరోలా ఉంది. ఇన్ని సినిమాల్లో మాకు ఎక్కువ లాభాలను తెచ్చి పెట్టిన సినిమా ఇదే  అన్నారు. విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ  హిట్, సూపర్‌హిట్ అనుకుంటే.. ప్రేక్షకులు సూపర్ డూపర్ హిట్ చేసేశారు. మనస్ఫూర్తిగా ప్రేక్షకుల కళ్లలో ఆనందం చూసినప్పుడు.. పదేళ్ల తర్వాత థియేటర్కు వెళ్లి అక్కడ ఆడియెన్స్ రెస్పాన్స్ చూసినప్పుడు.. నాకు మాత్రం కళ్లలో కన్నీళ్లు వచ్చేశాయి. మేం అందరం కష్టపడి పనిచేసినప్పుడు .. ప్రేక్షకులు బాగా ఆదరించినప్పుడు ఆ ఆనందమే వేరు. నాకు గణేష్, ప్రేమించుకుందాం రా, బొబ్బిలిరాజా, నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి ఇలా చాలా సినిమాలను నాకు సక్సెస్ చేశారు. చాలా ఏళ్ల తర్వాత ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. మీరు మళ్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలి. ఆడియెన్స్ మిమ్మల్ని అలా చూడాలనుకుంటున్నారని చెప్పినప్పుడు ఆనందమేసి అటెంప్ట్ చేశాను” అన్నారు.

Leave a Reply

Your email address will not be published.