తెలుగు సినిమాలో ఎవ్వరూ చేయని సాహసం

సౌత్ లో సమంత గోల్డెన్ హీరోయిన్ అని చెప్పొచ్చు. అత్యధిక విజయాల శాతం ఉన్నది సమంతకే. ముఖ్యంగా ఈ ఏడాది సమంత నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాయి. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు, యూ టర్న్ చిత్రాలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. సమంత ప్రస్తుతం కొన్ని క్రేజీ చిత్రాలలో నటిస్తోంది. మహిళా దర్శకురాలు నందిని రెడ్డి దర్శత్వంలో సమంత నటిస్తోంది. ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి.


సమంత, నందిని రెడ్డి సినిమా గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకురాలి ఆసక్తికరమైన టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఓ బేబీ! ఎంత సక్కగున్నావే’ అనే టైటిల్ ని సమంత చిత్రం కోసం నందినిరెడ్డి ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంత సక్కగున్నావే అనేది రంగస్థలంలోని పాట. సమంత అందాన్ని వర్ణిస్తూ సాగే ఈ పాట సూపర్ హిట్ గా నిలిచింది.ఈ చిత్రంలో సమంత పాత్ర అద్భుతంగా ఉండబోతోందని, ఇటీవల తెలుగు సినిమాలో ఎవ్వరూ చేయని సాహసాన్ని సమంత చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ సమంత చేసే ఆ సాహసం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. నాగ శౌర్య ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్ మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.


వివాహం తరువాత కూడా సమంత దూసుకుపోతోంది. గత ఏడాది మెర్సల్ చిత్రంతో 100 కోట్ల క్లబ్ లో చేరిన సమంత ఈ ఏడాది రంగస్థలం చిత్రంతో ఆ రికార్డుని మరోమారు సొంతం చేసుకుంది. మహానటి, యూ టర్న్ లాంటి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలని సమంత సెలెక్ట్ చేసుకుంటోంది. ప్రస్తుతం సమంత నందిని రెడ్డి చిత్రంతో పాటు తన భర్త నాగ చైతన్యతో ఓ చిత్రంలో నటిస్తోంది.ఇక దర్శకురాలు నందిని రెడ్డి సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నారు. నందిని రెడ్డి చివరగా తెరకెక్కించిన కల్యాణ వైభోగమే చిత్రం నిరాశపరిచింది. సమంతతో రూపొందిస్తున్న చిత్రంతో ప్రతిభ చాటుకోవాలని నందిని రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత పాత్ర గ్లామర్ కు దూరంగా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలియనున్నాయి. 

Leave a Reply

Your email address will not be published.