నా సినిమా ఆపడానికి ప్రయత్నించిన వాళ్లపై కేసులు పెడతా

ఒకప్పుడు విలక్షణ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వివాదాల దర్శకుడిగా ట్యాగ్ అందుకుంటున్నాడు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా టైటిల్ మార్చుకుని.. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే టైటిల్ తో అన్ని రకాల అవాంతరాలు దాటి థియేటర్లలోకి అడుగు పెట్టింది. ఓ పక్క కోర్టు కేసులు, దానిపై రకరకాల వాదనలు, సెన్సారు వ్యవహారాలు, అధికారుల అడ్డంకులు ఇలా అన్నీ పూర్తయిన తరువాత సినిమా థియేటర్లలోకి వచ్చిన నేపథ్యంలో దర్శకుడు ఆర్జీవీ ఓ చిన్న విడియో బైట్ వదిలారు. ఈ సినిమాను ఆపడానికి చాలా మంచి ప్రయత్నించారు. కానీ వారివల్ల కాలేదు. అనుకున్నట్లుగానే సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారు ఎవరో నాకు తెలుసు. త్వరలోనే ఆ విషయాన్నీ బయటపెట్టి చట్టపరమైన కేసులు కూడా పెడతా అని వీడియోలో తెలిపాడు.