హీరోగా యాంకర్ రవి….

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యాంకర్ ప్రదీప్. ఇప్పటి వరకు ఈయన చేసిన షోస్ అన్నీ దాదాపు సూపర్ హిట్ అయ్యాయి. బుల్లితెరపై తనకంటూ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ ఒక్క పెళ్లిచూపులు మాత్రమే ఆయన ఇమేజ్ దెబ్బతీసింది. కానీ మిగిలినవన్నీ షోలు ఆయనకు మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి. అయితే యాంకర్ ప్రదీప్ ఇప్పుడు హీరోగా వెండితెరపైకి రాబోతున్నాడు. చాలా రోజుల నుంచి ప్రదీప్ హీరో కావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ సరైన కథ దొరకలేదు కాబట్టి వెనుక అడుగు వేశాడు. ఇటీవల యాంకర్ రవి కూడా హీరోగా ప్రయత్నించి.. మళ్లీ టీవీ షోలతో బిజీ అయిపోయాడు. ఆ మధ్య ఇది మా ప్రేమకథ అంటూ వచ్చాడు రవి. అది వచ్చినట్లు కూడా ప్రేక్షకులకు తెలియలేదు. దాంతో ఇక రవి మళ్లీ గో బ్యాక్ అనేసాడు.
ఇప్పుడు ప్రదీప్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ప్రదీప్ హీరోగా, మున్నా అనే దర్శకుడు సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే టైటిల్ అని కన్ఫర్మ్ చేసారు. సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజై మంచి రెస్పాన్సు తెచ్చుకుంది. సుకుమార్ దగ్గర కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేసాడు మున్నా. ఈ చిత్రాన్ని కొత్త నిర్మాతలు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 1947లో జరిగే పీరియాడికల్ కథ ఇది. రొటీన్ కథలతో కాకుండా కాస్త కొత్తగా ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు ప్రదీప్. ఇందులో లవ్ గురుగా నటిస్తున్నాడు ప్రదీప్ మాచిరాజు.
ఈ చిత్ర షూటింగ్లోనే గాయపడి నెల రోజులకు పైగా బెడ్ రెస్ట్ తీసుకున్నాడు ప్రదీప్. అయితే, ఇప్పటికే ఫస్ట్ లుక్ రానాతో లాంఛ్ చేయించాడు ఈ యాంకర్. ఇప్పుడు ఈ చిత్రంలోని నీలినీలి ఆకాశం అనే పాటను మహేష్ బాబుతో విడుదల చేయిస్తున్నాడు. జనవరి 31న ఈ పాట విడుదల కానుంది. ఫుల్ వీడియో సాంగ్ రానుంది. దీనికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా.. ఈ పాటను లేటెస్ట్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ పాడటం విశేషం.