ముప్పై సంవత్సరాల తరువాత తిరిగి వెలుగులోకి వచ్చింది

 
కమల్  హాస‌న్ హీరోగా వ‌చ్చిన చాలా చిత్రాల‌లో లిప్‌లాక్‌లు మ‌నం చూసాం. కాగా  1986 లో త‌మిళంలో వ‌చ్చిన‌ ‘పున్నగై మన్నన్’ లో నటి రేఖతో లిప్ లాక్ పై ఇంటర్నెట్‌లో వివాదం చెలరేగుతోంది. ఈ మ‌ధ్య  రేఖ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఈ చిత్రంలో న‌టించే  తనకు పదహారేళ్ల వయసని,   ఇలాంటి ముద్దు సీన్ ఉంద‌ని  ఆ స‌న్నివేశంలో తనకు తెలియదని పేర్కొంది.  ద‌ర్శ‌కుడు బాల చందర్ కూడా ఈ విష‌యం త‌న‌కి చెప్ప‌లేద‌ని పేర్కొంది.

జలపాతం నుంచి పడి కమల్ ఆత్మహత్య చేసుకునే స‌న్నివేశం జ‌రుగుతున్న‌ప్పుడు  లెజండరీ డైరెక్టర్ కె. బాల‌చంద‌ర్ సూచించార‌ని, కానీ  కమల్  ఎలాంటి సూచ‌న‌లూ లేకుండా త‌న పెదవులపై ముద్దు పెట్టుకున్నార‌ని, అది తాత్కాలిక‌మే అయినా త‌న జీవితంలో ఇప్ప‌టికీ   చాలా అసౌకర్యంగా క‌నిపిస్తోంద‌ని అన్నారు.   ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్లుగా ప‌నిచేసిన‌ వసంత్, సురేష్ కృష్ణ  సన్నివేశాన్ని ఎలివేట్ అవ్వ‌కుండా చేస్తామ‌ని  హామీ ఇచ్చారని, కానీ సినిమాకి అది పెద్ద ఎసెట్‌గా మారిపోవ‌టంతో మాట్లాడ‌లేక‌పోయాన‌ని వివ‌రించింది రేఖ‌. 

రేఖ ఇంట‌ర్వూ చూసిన నెటిజ‌న్లు అటు బాల‌చంద‌ర్‌ని, ఇటు క‌మ‌ల్‌హాస‌న్‌ని తెగ ఆడేసుకుంటున్నారు. విమ‌ర్శ‌ల ప‌రంప‌ర కురిపిస్తున్నారు. రేఖకు కమల్ క్షమాపణ చెప్పాలని న‌టి, గాయ‌ని చిన్మ‌యి త‌న ట్విట్ట‌ర్‌లో డిమాండ్ చేసారు.  

అయితే ఈ విష‌య‌మై రేఖ స్పందిస్తూ, ఈ వివాదం తనను తిరిగి వెలుగులోకి తెచ్చిందని, ముప్పై సంవత్సరాల తరువాత  దీనిని తెర‌మీద‌కు తెచ్చి వివాదం చేయ‌టం స‌రికాద‌ని పేర్కొంటూ  బాలచందర్ , కమల్ హాసన్ ఇద్దరిపై తనకు అపారమైన గౌరవం ఉందని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published.