అదేంటి సినిమా చూస్తే పోలీసులు నోటీసులు ఇస్తారా..?సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మికమందన్నాహీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌కత్వంలో సంక్రాంతి పోటీలో ఉన్న  ‘సరిలేరు నీకెవ్వరు’ చూసిన న‌టి సంజ‌నకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అదేంటి సినిమా చూస్తే  పోలీసులు నోటీసులు ఇస్తారా అనేగా మీ సందేహం. కానీ సంజ‌న చేసిన ప‌నే ఇందుకు కార‌ణం.

 తాజాగా..  నటి సంజన బెంగ‌ళూరులోని ఓధియేట‌ర్‌లో  ఈ సినిమా చూడ‌టంతో పాటు తను సినిమా చూశాననే విషయాన్ని చెప్పడానికి ధియేట‌ర్ నుంచి తిరిగి వ‌స్తూ డ్ర‌యివింగ్ లో  సెల్ఫీ వీడియో తీసి మ‌రీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, త‌న ఆనందాన్ని అంద‌రితో పంచుకుంది.

ఆ వీడియో అటు తిరిగి ఇటు తిరిగి ట్రాఫిక్ పోలీసులని చేర‌టంతో వాళ్లు సంజ‌నకి  నోటీసులు పంపడంతో పాటు స్టేష‌న్‌కి విచారణ నిమిత్తం హాజరు కావాలని ఆదేశాలిచ్చారు.   డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ వాడటం నేర‌మ‌ని, కానీ సంజ‌న   ఫోన్‌లో మాట్లాడుతూ.. సెల్ఫీ వీడియోలు తీయకూడదని  నీతులు చెప్పే సెలెబ్రిటీ ఇలా చేయ‌ట‌మేంట‌ని సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ అవుతున్న కామెంట్ల‌పై పోలీసులు స్పందించారు.  రూల్స్‌ని బ్రేక్ చేస్తే.. ఎవ‌రైనా తేడా లేకుండా.. చలాన్లు వేస్తామని పోలీసులు తేల్చిచెబుతున్నారు.

అయితే    సంజన మాత్రం త‌న‌కు పోలీసులు నోటీసులు పంప‌డంపై హతాశురాలై వారిపై రుసరుసలాడుతోంది . అయితే ఈ వ్యవహారంపై సంజన స్ప‌ష్ట‌మైన స్పంద‌న మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా చెప్ప‌లేదు…
 

Leave a Reply

Your email address will not be published.