నాని కొత్త చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ టైటిల్ రిలీజ్

నాచురల్ స్టార్ నాని జన్మదిన సందర్భంగా ఆతని కొత్త చిత్ర పేరును ‘శ్యామ్ సింగ రాయ్’ గా నేర్కొంటూ ఒక వీడియో ద్వారా ప్రకటించింది ఆ సినిమా యూ నిట్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాకు విజయ్ దేవరకొండతో టాక్సీవాలా సినిమాకి దర్శకత్వం వహించిన రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు .
అతి త్వరలో ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్ర షూటింగ్ ప్రారంభించి ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది.
కాగా ప్రస్తుతం ‘వి’ తో పాటు ‘టక్ జగదీశ్’ సినిమాల్లో నటిస్తున్న హీరో నానికి పుట్టినరోజు శుభాకాంక్షలందిస్తూ ఇలా సినిమా టైటిల్ ప్రకటించడంతో అభిమానులు సందడి చేస్తున్నారు.