భారతావని గళం నిజమైన వేళ

*ఎన్ కౌంటరే ప్రజాతీర్పు*
-ప్రజాగ్రహనికి తలవంచిన రాజ్యం
-న్యాయ,ధర్మం,గాడిదగుడ్డు అంటున్న జనం
-రియల్ హీరో సజ్జనార్ అంటు ప్రశంసలు
-ఆయనపై పూలవర్షం
దిశ సంఘటనలో భారతావని గళం నిజమైంది.ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపి హత్య చేసిన మృగాలను కఠినంగా శిక్షించాలని దేశం యావత్తు గర్జించింది.దుండగులను తమకు అప్పగిస్తే తగిన దండన విదిస్తామని ఆందోళనకారులు దడిమాండ్ చేశారు.పోలీస్ స్టేషన్ పై దాడికి పూనుకున్నారు.దేశం మొత్తం నిరసనలు వెల్లు ఎత్తాయి. పార్లమెంట్ ముక్తకంఠంతో ఖండించింది.చివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పై సైతం విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.దీంతో ప్రజాగ్రహంకు తలవంచిన ప్రభుత్వం ఎన్ కౌంటరే అంతిమతీర్పుగా బావించారు. అది అమలు చేశారు.కేసు రీకస్ట్రక్షన్ కోసం దుండగులను దిశపై అత్యాచారం,హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే దుండగులు తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించారని,పోలీసులుపై రాళ్ళు రువ్వటమే కాకుండా దాడికి ప్రయత్నించి ఆయుధాలు లాక్కునేందుకు తెగబడటంతో కాల్పులు జరపటంతో వారి చనిపోయినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.పోలీసులు చేసింది మంచా,చెడా న్యాయమా?ధర్మమా? గాడిద గుడ్డా అనేది పక్కన పెడితే ఒక యువతిపై జరిగిన దారుణాతి దారుణానికి ఒడిగట్టిన కిరాతుకులకు తగిన శిక్షపడిందని దేశం యావత్తు తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ,ప్రత్యేకించి పోలీసులను దీనికి నాయకత్వం వహించిన సజ్జనార్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు . ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో సజ్జనార్ పై ప్రజలు పూలవర్షం కురిపించారు.దేశచరిత్రలో బోర్డర్ లో  శత్రుదేశాలపై జరిగే యుద్ధాలలో పాల్గొనే సైనికుల కన్నా తెలంగాణ పోలీసులకు ప్రజల నుంచి వచ్చిన మద్దతు అపూర్వం . న్యాయన్యాయాలు పక్కన పెడితే ఇది పౌరసమాజం  నుంచి వచ్చిన తీర్పేననటంలో ఏలాంటి సందేహం లేదు. 7 సంవత్సరాల క్రితం ఢిల్లీలో నిర్బయకేసు జరిగితే దండగులకు సరైన శిక్షలు లేవు. ఉత్తరప్రదేశ్ లో ఉన్నవ్ ఘటన,అసిఫాబాద్ లో టేకు లక్ష్మి అనే దళిత మహిళ ఘటన  నిన్న పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఉదంతంపై పాలకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published.