వామ్మో! అనుప‌మా … ఇదేం నోర‌మ్మా?

అస‌లే  సినిమా అవకాశాలు తగ్గుముఖం ప‌డుతుండ‌టంతో ఈమ‌ధ్య  వేదాంత ధోరణిలో మాట్లాడటం ఆరంభించింద‌ట అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.  కానీ త‌ను చెప్పిందే మీరు వినాలంటూ స్నేహితుల‌పై మండి ప‌డ‌తోంద‌ని స‌న్నిహిత వ‌ర్గాల టాక్‌. సెట్‌లో డైరెక్టర్  చెప్పినట్లు వింటా, న‌న్ను నేను నిరూపించుకుంటా. ఇంట్లో, తన వ్యక్తిగత విషయాల గురించి తల్లిదండ్రులు చెబితే వింటాను కానీ బంధువులు, సన్నిహితులు, స్నేహితులు సలహాలిస్తే మాత్రం తెగ చిర్రెత్తుకొస్తుందంటోందట‌ అనుప‌మ‌. దీంతో ఈవిడ‌గారితో కాసింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, లేకుంటే నోరు పారేసుకోవ‌టం కూడా అల‌వాటు కావ‌టంతో కాస్త వెన‌క్కి త‌గ్గుతున్నార‌ట అంతా.  అందంతో పాటు కోపం అనుపమకు ఎక్కువే అన్న డైరెక్టర్లు లేకపోలేదు. అలాగే అందుకే అనుపమతో స్నేహితులు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడటం ఆరంభించార‌ట‌. ఆమె గారు త‌ను ఎక్క‌నున్నాన‌న్న సంగ‌తి మ‌ర‌చి అరుపుల‌తో, కేక‌ల‌తో భీభ‌త్సం చేస్తుండ‌టంతో. యూనిట్లో ఉన్న వారు అమ్మా.. నువ్వు ఇలా చేయకూడదమ్మా..   అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నా మీరెవ‌రు నాకు చెప్ప‌డానికంటూ గ‌య్యిమంటోంద‌ట‌. అంతే మ‌రి నోటికి భ‌య‌ప‌డ‌ని వాడెవ‌డుండ‌ని అనుప‌మ‌ని చూస్తే ఇట్టే తెలుస్తోందంటోంది ఫిలింన‌గ‌ర్‌.
Leave a Reply

Your email address will not be published.