జనసేన నుంచి యువత కే అధిక ప్రాధాన్యం

2024 ఎన్నికల్లో భాజపా, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ధీమా వ్యక్తం చేశారు మంగళవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలే రానున్న ఎన్నికలన్నింటికీ నాందిగా నిలవనున్నాయని అన్నారు.
జనసేన నుంచి యువత కే ఈ ఎన్నికలలో అధిక ప్రాధాన్యం ఇస్తు, సీట్లు కేటాయిస్తున్నామని, స్థానిక ఎన్నికల్లో జనసేన, భారతీయ జనతాపార్టీ కలిసి బలమున్న ప్రతి చోట పోటీ చేస్తు ముందుకెళ్తున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలను హడావుడిగా జరపడం వెనుక అనేక కారణాలున్నాయని, అలాగే ఇప్పటికే తెరవెనుక తతంగాలకు ప్రభుత్వ పెద్దల సహకారంలో పోలీసులు, అధికార పక్ష నేతలు తెరలేపారని ఆరోపించారాయన. ఓటర్లు అధికార పక్షం చూపించే తాత్కాలిక ప్రలోభాలకు గురికాకుండా ఉండాలని నిజాయితీగా ఎన్నికలను ఎదుర్కోనేందుకు జనసేనతో కలసి రావాలని సూచించారు మనోహర్.