ఎన్టీఆర్ త్రివిక్రమ్ చిత్రం ఖరారు

గత కొంత కాలంగా నందమూరి అభిమానులను ఊరిస్తూ వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలయికలో మరో సినిమాకు రంగం సిద్దమైంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత ఘన విజయాన్ని సాదించిన నేపథ్యంలో ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఆశలు ఫలించాయి.
RRR చిత్రం తదుపరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోయే ఈ చిత్రం 2021 వేసవి లో విడుదల చేస్తున్నట్లు బుధవారం చిత్ర బృందం అధికారికం గా ఓ ప్రకటన విడుదల చేసింది. హారిక హాసిని మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ల పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కళ్యాణ్ రామ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవి నుండి షూటింగ్ ఆరంభమవుతుందని యూనిట్ వర్గాలు చెప్పాయి. ఇతర నటీ నటుల మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం అని చిత్ర బృందం తెలిపింది .