`హిట్‌` సినిమా ట్రైల‌ర్‌ విడుద‌ల
`ఫ‌ల‌క్‌నుమాదాస్` వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం `హిట్‌`. `ది ఫ‌స్ట్ కేస్‌` ట్యాగ్ లైన్‌. ప్ర‌శాంతి త్రిపిర్‌నేని నిర్మించిన ఈ చిత్రంలో రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను బుధ‌వారం హైద‌రాబాద్‌లో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు విడుద‌ల చేశారు. 

ఈ సంద‌ర్భంగా…. దిల్‌రాజు మాట్లాడుతూ – “ ఎప్పుడూ భిన్న‌మైన సినిమాలు చేయాల‌నుకునే నాని త‌ను హీరోగా ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ నిర్మాత‌గా మారి తొలి చిత్రం అ! నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌స సినిమాలు విభిన్నంగా రూపొందిస్తున్నాడు ఇప్పుడు హిట్ లాంటి మ‌రో సినిమా ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్న ఆత‌ని ధైర్యానికి అభినంద‌న‌లు. ఇలాంటి మ‌రిన్ని చిత్రాలు ప్రొడ్యూస్ చేయాల‌ని కోరుకుంటున్నాను.అని అన్నారు. ట్రైల‌ర్ చూస్తుంటే ఆస‌క్తిక‌రంగా ఉంది. థియేట‌ర్‌కు వెళ్లాల‌నే ఆస‌క్తి క‌లుగుతుంది అన్నారు. నైజాం, వైజాగ్‌ల‌లో మేమే సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.

హీరో విశ్వ‌క్‌సేన్ మాట్లాడుతూ – “ శైలేష్ ఈ సినిమా క‌థ చెప్ప‌గానే మ‌రేం ఆలోచించ‌కుండా సినిమా చేయ‌కుండా ఓకే చేసాను అత‌ను చెప్పిన విధానం నాకు న‌చ్చింది. విన్న‌ప్పుడే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా ఎంజాయ్ చేశాను. ప్ర‌తి సినిమాకు యాక్టింగ్‌తో పాటు సినిమాలో మ‌రో ఎక్స్‌ట్రా వ‌ర్క్ చేసేవాడిని. కానీ.. హిట్ సినిమా విషయానికి వ‌స్తే.. యాక్టింగ్ త‌ప్ప మ‌రేమీ చేయ‌లేదు సినిమా థియేట‌ర్‌కొస్తే మామూలుగా ఉండ‌దు. ఇంత మంచి డైరెక్ట‌ర్ దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది“ అన్నారు.

హీరోయిన్ రుహానీశ‌ర్మ మాట్లాడుతూ – “ ట్రైల‌ర్‌లో మీరు చూసిన దానిక‌న్నా సినిమాలో ఇంకా ఎక్కువ థ్రిల్ ఉంటుంది. ఈ చిత్ర యూనిట్‌లో ప‌ని చేయ‌టం అందునా స‌హ‌జ‌న‌టుడు విశ్వ‌క్‌తో వ‌ర్క్ చేయ‌డం చాలా హ్యాపీ అని చెప్పారు.

డైరెక్ట‌ర్ శైలేంద్ర మాట్లాడుతూ – “ట్రైల‌ర్ చూస్తే ఇది. థ్రిల్ల‌ర్ మూవీ అనిపించ‌క మాన‌దు. ఫ‌స్ట్ నుండి లాస్ట్ వ‌ర‌కు ఆడియ‌న్స్‌ను టెన్ష‌న్ పెట్టే సినిమా ఇది అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published.