తెలంగాణ యువ రైతు పై మంత్రి పెద్దిరెడ్డి దౌర్దన్యం

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపిలో పేరెన్నిక గల మంత్రి , ప్రస్తుత జగన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలన్నీ చూసే వ్యక్తి ఆయనే. ఆంధ్రాలో మంత్రిగా తెలంగాణలో కాంట్రాక్టరుగా డ్యుయల్ రోల్ పోషిస్తున్న పెద్దిరెడ్డి శివమాల ధరించి ఈ మధ్య కనిపిస్తున్నారు. తనలో కొండంత మానవత్వం తొణికిసలాడాడుతున్నట్టు కనిపించే ఆతనిలో ఈ మధ్య శిఖర స్థాయిలో అసహనం ప్రబలి, ఓ కూలిపై దాడి చేయించిన ఘటనల తాజాగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే… యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ లో పెద్దిరెడ్డి చేపట్టిన జర్వాయర్ కు సంబంధించి భూములను భారీగా తీసుకున్న ప్రభుత్వం పరిహారం చెల్లింపులలో మీన మేషాలు లెక్కిస్తోందని, రిజర్వాయర్ కోసం భూమిని త్యాగం చేసి, అక్కడ జరుగుతున్న పనుల్లో కూలీలుగా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఇదే అంశాన్ని ఈ రిజర్వాయర్ కాంట్రాక్టు పనులు పరిశీలనకు వచ్చిన అమాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ని కలసి విన్నవించేందుకు కొందరు కూలీలను తీసుకుని ఉడుత రవి అనే యువ రైతు వెళ్లాడు. పలు ఆఫీసుల చుట్టూ ఎన్నో ఏళ్లుగా తిరుగుతున్నా పరిహారం అందడంలేదని, ప్రభుత్వానికి చెప్పి తమకు పరిహారం ఇప్పించాలని కోరాడు. ఇదే ప్రాంతంలో రైతులుగా హూందాగా గడిపిన తాము . రిజర్వాయర్ పనుల్లో తన కుటుంబీకులతో కలసి లేబరుగా పని చేయాల్సి వస్తోందని పెద్దిరెడ్డితో మొరపెట్టుకున్నాడు.