నాగ్ అశ్విన్- ప్రభాస్‌ల కాంబినేషన్లో కొత్తచిత్రం

‘మహానటి’తో జాతీయ అవార్డును గెలుచుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ చిత్రాల నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్లో రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా ఓ సినిమా ఆరంభించనున్నట్టు బుధవారం ఆ సంస్ధ ఓ ప్రకటన చేసింది.
మహానటి హిట్ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న నాగ్ అశ్విన్ తదుపరి సినిమాపై వస్తున్న ఊహాగానాలకు దీంతో తెరదించినట్టయ్యింది.
కాగా నాగ్ అశ్విన్- ప్రభాస్‌ల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని సమాచారం. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్‌స్టోరిలో నటిస్తున్న ప్రభాస్ ఈ చిత్రం పూర్తి కాగానే నాగ్ అశ్విన్ సినిమాకు షిఫ్టవుతారని తెలుస్తోంది. వచ్చే జూన్‌లో ఆరంభించి, సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలచేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని వైజయంతి సంస్ధ ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పారు. ఉన్నారు.