సున్నా మహత్యమేరా… చదువుకున్న సన్నాసుల్లారా”

జనసేన మొన్నటికి మొన్న బీజేపీతో పొత్తు పెట్టుకుంది కదండీ.. అందుకే ఆ పొత్తుపై నిన్నటికి నిన్న విజయసాయి రెడ్డి సెటైర్లు వేస్తే.. ఈరోజు విజయసాయిపై నాగబాబు సెటైర్లు వేశాడు. అసలు నిన్న విజయసాయి రెడ్డి ఎం సెటైర్ వేశారు అంటే.. ”గుండు సున్నా దేనితోనైనా కలిసినా, విడిపోయినా ఫలితం జీరోనే. సున్నాను తలపైన ఎత్తుకున్నా, చంకలో పెట్టుకున్నా జరిగేదదే. ఇది పదేపదే నిరూపితమవుతూనే ఉంటుంది. అయినా ప్రయోగాలకు సాహసించే వారు ప్రయత్నిస్తూనే ఉంటారు. దెబ్బతింటుంటారు. మనం పాపం అనుకుంటూ వదిలేయాలి” అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ట్విట్ చేశారు. ఈ ట్విట్ కు సెటైర్ గా నాగా బాబు ఓ ట్విట్ ఒదిలాడు.. అది ఏంటంటే… ”సైన్స్, కంప్యూటర్స్, మ్యాథ్స్ ఇంత డెవలప్ అయ్యాయంటే.. సున్నా మహత్యమేరా… చదువుకున్న సన్నాసుల్లారా” అంటూ ఘాటుగా ట్విట్ చేశారు. ఈ ట్విట్ చుసిన వైసీపీ, జనసేన అభిమానులు మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. దీంతో ఈ ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.