డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభుదేవా…

కొరియోగ్రాఫర్ గా, హీరోగా, దర్శకుడిగా పలు సంచలన విజయాలు సాధించిన ప్రభుదేవా తొలిసారి డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్ గా సంఘ విద్రోహశక్తుల పాలిట సింహస్వప్నంగా నిలిచే పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకులను ఉర్రూతలూగిం చేందుకు ‘కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్ గా ప్రేక్షకుల ముందు వచ్చేస్తున్నాడు. తమిళ నాట ఇప్పటికే విడుదలైన టీజర్ పోస్టర్లు అనూహ్యంగా సామాజిక మీడియాలో హల్ చల్ చేస్తున్న చిత్రాన్ని తెలుగులో పవనపుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై యనమల సుధాకర్ నాయుడు సమర్పణలో.. సీనియర్ ప్రొడ్యూసర్ ఆర్.సీతారామరాజు అనువదిస్తున్నారు.
ముఖిల్ చెల్లప్పన్ దర్శకత్వంలో ప్రభుదేవా తొలిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మాస్ మసాలా ఎంటర్ టైనర్ లో ‘అల వైకుంఠపురములో’ ఫేమ్ నివేదా హీరోయిన్ కాగా.. బాహుబలి ప్రభాకర్, సురేష్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమిళంతోపాటు తెలుగులో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత ఆర్.సీతారామరాజు తెలిపారు.