‘అసురన్’ చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న చిత్రం ‘నారప్ప‘

వరుసగా యూత్ కాంబినేషన్ చిత్రాలు చేస్తూ, హిట్లతో దూసుకుపోతున్న వెంకటేష్ మరోమారు హీరోగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప‘. తమిళ్లో బ్లాక్‌బస్టర్ గా నిలచిన ‘అసురన్’ చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్నఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న విషయం విదతమే.
ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ‘నారప్ప యాక్షన్ సన్నివేశాలు తమిళనాడులో జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ మీడియాకు వివరిస్తూ, ” తమిళనాడులోని రెడ్ డెసర్ట్ లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రానికి హైలెట్ అవుతాయని, 10 రోజులు తీసిన ఈ సీన్లు వెంకటేష్ కి, నాకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అన్నారు.
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ, ” నారప్ప తో సరి కొత్త వెంకటేష్ ని తెలుగు ప్రేక్షకులు చూస్తారని, అసురన్‌కి తీసిపోని విధంగా ఈ సినిమా రూపొందుతోందని చెప్పారు.
కో- ప్రొడ్యూసర్ దేవి శ్రీదేవి సతీష్ మాట్లాడుతూ – “తమిళనాడులోని తిరిచందూర్ సమీపంలో 12,000 ఎకరాల్లో ఉండే రెడ్ డెసర్ట్ ఆఫ్ తమిళనాడు గా తెరికాడు లో నారప్ప యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశాము. చాలా బాగా వచ్చాయని అన్నారు. ఇప్పటికే 27 రోజులు షూటింగ్ పూర్తయ్యిందని ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం” అన్నారు.