మనసెరిగిన మహారాజు శోభన్‌బాబు

సినీ శోభన్ నటుడు 84వ జయంతి కార్యక్రమాలు హైదరాబాద్ రవీంద్ర భారతిలో అంగరంగవైభవంగా జరిగాయి. గురువారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమాన్ని తెలంగాణాశోభన్బాబుసేవాసమితీ నిర్వహించింది. ఈ సందర్భంగా సినీ రచయితలు పరుచూరిబ్రదర్స్ కు సిల్వర్క్రౌన్ 2020 అవార్డు తో సత్కరించారు.
ఈ సందర్భంగా పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ తాము శోభన్ బాబుకు పలు చిత్రాలు రచించామని, మనసెరిగిన మహారాజు శోభన్‌బాబు అని అన్నారు. ఆనాటి సినీనటులలో శోభన్‌బాబు అందాలనటుడే కాదు… కుటుంబకథా చిత్రం అనగానే దర్శకులు ముందు సంప్రదించేది శోభన్‌బాబునే అంత క్రేజ్ ఆయనది. అందుకే ఎక్కువ కుటుంబకధల నే ఎక్కువగా చేయటంతో పాటు తన సినిమాలు కుటుంబమంతా కలసి చూసి ఆనందించేలా ఉండేవారని ఆకాంక్షించేవారన్నారు.
పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శోభన్‌బాబు నటన, అబినయం, క్రమశిక్షణ, అందరితో అనుకువగాఉండటం నేటితరం నటీ నటులకు మార్గదర్శకమని అన్నారు. సినీ నటులు విజయగర్వాలతో జీవితాలను నష్టపరుచుకోకుండా… ఎలా ఆర్ధికంగా నిలదొక్కుకుని భవిష్యత్‌ని చూసుకోవాలో దారి చూపిన వ్యక్తి శోభన్‌బాబు అని, ఆయన సూచనలతో అడుగులు వేసిన వారంతా ఇప్పుడు జీవితాలను నిశ్చింతగా గడుపుతున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖగాయని శృతిలయసంస్థ అధినేత్రి ఆమని నేతృత్వంలో ఎవరీ చక్కని వాడు పేరున శోభన్‌బాబు నటించిన పలు చిత్రాలలోని పాటలను ఆలపించి సభికులను, ఆహూతులను పరవశింపచేసారు.