వాళ్లు మద్దతు ఇవ్వకుంటే సినిమాలు బహిష్కరిద్దాం

అమరావతి రైతులకు అండగా నిలవని సినీ నటుల సినిమాలను బహిష్కరించాలని ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి అమరావతి రైతులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆమె వారికి సంఘీభావం తెలుపుతూ… వేలాది కోట్లు తెలుగు నాట నుంచి లాభాలందుకుంటున్న సినీ నటులు రాష్ట్రంలో జరుగుతున్నఆందోళనపై కనీసంస్పందించకపోవటం సరికాదని, ఇప్పటికైనా స్పందించి రైతుల దీక్షకు సంఘీభావం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సంక్రాంతి సీజన్ సినిమా వాళ్లకి వచ్చేసింది. కాసుల పండుగ తరుణమని పరిశ్రమలో ప్రతిఒక్కరూ భావిస్తారు. గతంలో విపత్తులు వచ్చినప్పుడు సినీ పరిశ్రమ అండగా నిలిచింది, దానికి తెలుగు ప్రజల మద్దతు కూడగట్టుకున్నాని పద్మశ్రీ గుర్తుచేశుకున్నారు. కానీ ఇప్పుడూ అలాంటి సమస్యే రైతులకు ఎదురైతే మీరెందుకు స్పందించరని ఆమె సినీనటులను నిలదీసారు. తక్షణం సినీ నటులు రాజధాని రైతులకు మద్దతు ఇవ్వాలని, వారికి సంఘీభావం ప్రకటించని సినీ నటుల సినిమాలు బాయ్‌కట్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.