కరోనా వల్ల శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవ వేడుకలు వాయిదా

ప్రతి యేటా తన జన్మదినోత్సవంతో పాటు తిరుపతి లోని శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవాన్ని మార్చి 19వ తేదీన జరిపే మోహన్ బాబు తాజాగా ఈ వేడుకలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకు తీవ్రం అవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో ఈ వేడుకలను వాయిదా వేసుకున్నట్టు చెప్పారు.
కరోనా వైరస్ భయాందోళనలతో జనం భయపడుతున్నారని, ఎక్కడా గుంపులుగుంపులుగా ఉండడం మంచిది కాదని కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలను గుర్తు చేస్తూ, పుట్టిన రోజుని పురస్కరించుకుని తనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయడానికి ఎవరూ రావొద్దని సూచించారు మోహన్‌బాబు.