రాజధానిపై ప్రజలు కూడా సానుకూలంగా లేరు …

విశాఖపట్నంలో రాజధానిపై ఉత్తరాంధ్ర ప్రజలు కూడా సానుకూలంగా లేరని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖలో రాజధాని వస్తే తమ ప్రశాంతతకు భంగం కలుగుతుందని విజయనగరం వాసులు అంటున్నారని కన్నాలక్ష్మీనారాయణ తెలిపారు. దోచుకునేందుకే విశాఖలో రాజధాని అంటున్నారని విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాజధానులు మారిస్తే ఎలా అని ప్రశ్నించారు.
వైసీపీ, టీడీపీ అనే రెండు కార్పొరేట్ కంపెనీల చేతిలో ఏపీ ప్రజలు పూర్తిగా నలిగిపోతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని దోచుకోవాలన్న ఆలోచన తప్ప…రాష్ట్రాభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్ పేదల రక్తాన్ని పిండుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజలు బతికే పరిస్థితి లేదని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.