శ్రీరెడ్డి కారు ధ్వంసం చేసారట

తన ఇంటి సమీపంలో ఉన్న ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి బంగ్లా వేదిక చేసుకుని సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయని, తమన్నా వెబ్ సిరీస్ షూటింగ్ కు తన ఇంటి ముందే పదుల సంఖ్యలో కార్లు నిలిపేస్తుండటంతో ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆ ప్రొడక్షన్ యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసేది.
అయితే.. రెండు రోజుల క్రితం తాను బయటకు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి రాగానే.. తన ఇంటి ముందు అడ్డుగా చిత్ర యూనిట్‌కి సంబంధించిన వాహనం నిలిపి ఉండటంతో తన ఆడి కారును బయట పెట్టానని, తిరిగి వచ్చి చూస్తే నా ఆడి కారుపై ఇష్టానుసారంగా గీతలు గీసి ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ విషయమై కోయంబేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తునే ప్రొడక్షన్ మేనేజర్ మనోజ్‌పై అనుమానం ఉందని శ్రీరెడ్డి పేర్కొన్నారు. సు నమోదు చేసుకున్న కోయంబేడు ఇన్స్పెక్టర్ మాదేశ్వరన్ విచారణ జరుపుతున్నారు.