ఇక వ‌ర్మ టార్గెట్ అంతా బ్రూస్లీపైనేనా…?

వ‌ర్మ ఆయ‌న‌దో డిఫ‌రెంట్ స్టైల్ త‌న‌కు న‌చ్చిన‌ట్లు ఉంటాడు  త‌న‌కు న‌చ్చిన క‌థ‌ల‌ను ఎంచుకుని సినిమాలు తీస్తుంటాడు. అదే విధంగా ఈ మ‌ధ్య ఆయ‌న తెర‌కెక్కిస్తున్న చిత్రాలన్నీ కూడా దాదాపుగా కాంట్ర‌వ‌ర్సీలే ఉంటున్నాయి. ఈ నేప‌ధ్యంలో క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు అన్న సినిమా తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుత రాజ‌కీయాలను దృష్టింలో పెట్టుకుని తీసినందువ‌ల్ల రెండు రాష్ట్రాల్లోనూ హీటు పెట్టిస్తుంది.

అయితే ఇలాంటి వివాదాస్ప‌ద చిత్రాలు తీయ‌డం వ‌ల్ల ఎప్పుడూ ఏదో ఒక స‌మ‌స్య‌తో కోర్టుకు ఎక్క‌డం సెన్సార్ స‌మ‌స్య‌లు ఇవ‌న్నీ త‌న‌కి మామూలు అయిపోయాయి. ఇక ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ఆయ‌న ఈ రోజు మ‌ధ్యాహ్నం ఆ సినిమాకి సంబంధం లేని పోస్టర్ ను విడుదల చేసి హాట్ టాపిక్ గా మారారు.

ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ పేరుతో సినిమాను అనౌన్స్ చేశారు వర్మ. ఈ సినిమా టైటిల్ వర్మ అభిమానించే బ్రూస్లీ ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఎంటర్ ది డ్రాగన్ అనే టైటిల్ కు తనదైన  శైలిలో మార్పులు చేసినట్లుగా చెప్పాలి. ఈ సినిమా తన కెరీర్ లోనే ప్రతిష్ఠాత్మక మూవీగా ఆయన పోస్టు చేశారు. తెలుగులో తొలి మార్షల్ ఆర్ట్స్ మూవీగా పేర్కొన్నారు.

ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం 3.12 గంటలకు ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నట్లు చెప్పారు. దీనికి కారణం చెబుతూ.. బ్రూస్లీని అమితంగా ఇష్టపడి అమితంగాప్రేమించిన అమ్మాయి కథగా పేర్కొంటూ.. అందుకే బ్రూస్లీ గర్ల్ గా ట్యాగ్ లైన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సినిమాను ఇండియా చైనా సంయుక్త భాగస్వామ్యంలో నిర్మిస్తున్నారు. బ్రూస్లీ పుట్టినరోజు కానుకగా ఈ రోజు టీజర్ ను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. దీనికి ముందుగా పోస్టర్ ను విడుదల చేసి బజ్ క్రియేట్ చేశారు. ఈ చిత్ర అంతర్జాతీయ ట్రైలర్ ను బ్రూస్లీ సొంత పట్టణమైన చైనాలోని పోషన్ సిటీలో డిసెంబరు 13న విడుదల చేయనున్నారు. 


Leave a Reply

Your email address will not be published.