టైమ్స్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం

హైదరాబాద్ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్లకు  వర్క్ ఫ్రమ్ హోం అనుమతి ఇస్తూ యాజ‌మాన్యం వెసులు బాటు క‌ల్పించింది. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ రిపోర్టర్లు, మార్కెటింగ్ ఉద్యోగులు, ఫీల్డ్ లో తిరిగే ఇతర ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం చేసుకోవ‌చ్చని పేర్కొంది. 

హైదరాబాద్ తో సహా ఢిల్లీ, ముంబై నగరాల్లోని టైమ్స్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు (రిపోర్టర్లు, మార్కెటింగ్) వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటు క‌లిగింది.  వివిధ చోట్ల తిరిగే రిపోర్టర్లు, మార్కెటింగ్ సిబ్బంది కరోనా ట్రాన్స్మిటర్లుగా మారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోం ని సూచించిన‌ట్టు పేర్కొంది. తాజాగా ఈ బాట‌లోనే ప‌లు తెలుగు ప‌త్రిక‌లు కూడా ప‌య‌నించే ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది. 

Leave a Reply

Your email address will not be published.