‘దర్భార్’ తొలివారం కలెక్షన్స్ వింటే …

ఎన్ని భారీ చిత్రాలు వచ్చినా, ఎంత మంది హీరోలు ఇండస్ట్రీలోకి తరలి వస్తున్నా… తన సామ్రాజ్యాన్ని మాత్రం కించత్ కూడా కదపలేరెవ్వరూ అంటున్నాడు సూపర్ స్టార్ రజినికాంత్. అందుతు తగ్గట్టే ఆయన అభిమాన గణంలో ఆతని మేనియా గోరంత కూడా తగ్గక పోవటం కాదు కదా… తెరమీద తను కనిపిస్తే చాలు నిర్మాతలకు కనక వర్షం ఖాయమంటున్నాడు
తాజాగా రజనీ నటించిన దర్బార్ సంక్రాంతి రిలీజ్ దర్బార్ రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది. ఈనెల 9న విడుదలైన దర్బార్ తొలి వారం రోజులకే ఏకంగా 160కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రాబట్టినట్టు సినీ పండితులు చెపుతున్నారు. దర్బార్ తెలుగు, తమిళ మరియు హిందీ భాషలలో విడుదల కాగా అన్ని భాషలలో కలిపి వరల్డ్ వైడ్ గా ఈ మొత్తం రాబట్టింది. మరి శనివారం, ఆదివారాలు వారాంతపు సెలవులు కావటంతో దర్బార్ వసూళ్లు మరింత మెరుగయ్యే అవకాశం ఉందని రికార్డు లు సృష్టించడం ఖాయమని అభిమానులు చెపుతున్నారు.