పంచాయితీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా. ?
మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశం లో మార్చి15 కల్లా పంచాయతీ ఎన్నికలు ప్రక్రియ పూర్తి.  చేయాలని నిర్న‌యించిన విష‌యం విదిత‌మే. త‌క్కువ స‌మ‌యంలోనే వీటిని పూర్తి చేయాల‌ని, ఈ ఎన్నిక‌ల‌లో మ‌ద్యం డ‌బ్బులు పంచే అభ్య‌ర్ధుల‌పై వేటు వేయాల‌ని నిర్ణ‌యించి నానా హ‌డావిడి చేసారు ప్ర‌భుత్వ పెద్ద‌లు. 

అయితే ప్ర‌భుత్వం అనుకున్న‌ట్టు ఈ పంచాయితీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే పరిస్థితి కనిపించడంలేదన్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల మాట‌, ఇందుకు ప్ర‌ధాన కార‌ణం వచ్చే నెల 4 నుంచి ఇంటర్‌, 23 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ  పరీక్షల నేప‌థ్యంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాని ప‌ని అని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్ర‌భుత్వానికి తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం. ఎందుకంటే ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో భాగంగా పోలింగ్‌ కేంద్రాల కోసం ఎక్కువగా పాఠశాల భవనాలనే ఉపయోగిస్తుంటారు.  దీనికి తోడు ఎన్నికల నిర్వహణకు ప‌రీక్ష‌ల కారణంగా ఉపాధ్యాయుల సేవలు అంద‌కుండా పోతాయి దీంతో ప‌రీక్ష‌లు పూర్తయ్యే వరకు ఎన్నికల నిర్వహణ అసాధ్యమని అధికారులు చెబుతున్నారట.
 

Leave a Reply

Your email address will not be published.