డిఫరెంట్ జోనర్లో నీరజ్ పాండే ‘స్పెషల్ ఓపీఎస్’

డిజిటల్ రంగంలో దూసుకొస్తున్న హాట్ స్టార్ – స్టార్ మూవీ మేకర్ నీరజ్ పాండే కాంబినేషన్లో ‘స్పెషల్ ఓపీఎస్’ అనే ఓ స్పెషల్ షోను రూపొందించనుంది. గడిచిన 19 ఏళ్ల వ్యవధిలో జాతీయ స్థాయిలో జరిగిన కొన్ని ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ షో రూపకల్పన జరుగుతోందని నీరజ్ మీడియాకు చెప్పారు. అంతర్జాతీయ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ షోను టర్కీ, అజర్బైజాన్, జోర్దాన్, ఇండియా తదితర దేశాల్లో చిత్రీకరించనున్నామని వివరించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందనున్న ఈ షో ని ఫ్రైడే స్టోరి టెల్లర్స్ డిజిటల్ విభాగానికి చెందిన ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్ బ్యానర్‌పై వీటిని రూపొందిస్తున్నామని, శీతల్ భాటియా ఇందుకు సహకరిస్తున్నట్టు చెప్పారు. దీపక్ కింగార్ని, బెనజిర్ అలీ ఫిదాలతో కలిసి నీరజ్ పాండే ఈ స్పెషల్ ఓపీయస్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
ఈ యాక్షన్ థ్రిల్లర్ షోలోదేశంలోని అన్ని భాషలలోని ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పాలు పంచుకుంటున్నారని, కొన్ని ఘటనల కారణంగా దేశంలో పలువురి జీవితాలను ఎంత ప్రభావితం చేసాయన్నది తెరపై ఆవిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నం ఇదని, ఈ షో ప్రేక్షకులను ఆసక్తి కరమైన కథ కథనాలు ఆకట్టుకుంటాయని చెప్పారు. గతంలో హాట్‌స్టార్ రోర్ ఆఫ్ ది లయన్, క్రిమినల్ జస్టిస్, హోస్టెజస్ లాంటి ప్రత్యేక షోల తరహాలో ఈ షో కూడా భారీగా నిర్మిస్తున్నట్టు చెప్పారాయన.