భార్యపై కోపంతో అత్తారింటి వారిని లేపేసిన ప్రబుద్దుడు.. ఆపై
భార్య మీద కోపంతో, తన అత్తవారింటిపై పగ పెంచుకున్న ఓ వ్యక్తి నలుగురిని చంపేసి అనంతరం ఉరి వేసుకుని చనిపోయిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామానికి చెందిన లక్ష్మీ రాజ్యం(40)కు, సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లికి చెందిన విమలతో పద్దెనిమిదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. జీవనం కోసం లక్ష్మీరాజ్యం ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరి కాపురం కొన్నాళ్లు సజావుగా సాగింది,
కుమారుడు, కుమార్తె జన్మించాక ఖర్చులు అధికం కావటంతో అదనపు కట్నం తేవాలంటూ విమలను వేధింపులకు గురి చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆతనిపై 498 ఏ సెక్షన్ క్రింద కేసు కేసు నమోదు చేశారు. పోలీసులు దంపతుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు మూడుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినా కూడా ఇద్దరి మధ్య గొడవలు తగ్గక పోవటంతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే లక్ష్మీ రాజ్యం భార్య విమల తన జీవనానికి ఇబ్బందిగా ఉందని సిద్దిపేట కోర్టులో తన భర్త నుంచి భరణం ఇప్పించాలంటూ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ కోర్టులో ఉంది.
అయితే తనపై పోలీసు కేసు పెట్టి వేధించడంతో పాటు తననుంచి డబ్బులు తీసుకోవాలని తన భార్య చూస్తోందని, దానికి అత్తింటి వారు వత్తాసు పలుకుతున్నారంటూ గత కొంత కాలంగా మదన పడుతున్న లక్ష్మీరాజ్యం ఉన్మాదిగా మారి వేకువ ఝామున 2 గంటల సమయంలో అత్తగారింటి తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించాడు. గదిలో నిద్రిస్తున్న తన భార్య విమల(37), కుమార్తె పవిత్ర(11), కుమారుడు జయపాల్, బావమరిది జాన్‌రాజ్(38), ఆయన భార్య రాజేశ్వరి(32), వదిన (విమల అన్న సతీమణి) సునీతలపై పెయింట్ థిన్నర్ (పెయింట్‌లో కలిపే లిక్వీడ్) పోసి టపాసులు కాల్చి వారిపై విసిరేసి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అందరూ గాయపడ్డారు. విమల, మూడ్రోజుల వ్యవధిలో పవిత్ర, జాన్‌రాజ్, రాజేశ్వరి చనిపోగా సునీత, జయపాల్ చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్ధితి మరికొన్ని గంటలు గడిస్తే గానీ చెప్పలేమంటున్నారు వైద్యులు.
అయితే ఘటన జరిగిన నాటి నుంచి నిందితుడైన లక్ష్మీ రాజ్యం కోసం పోలీసులు గాలిస్తున్నా ఎక్కడా దొరక లేదు. ఆదివారం జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామ శివారులో మర్రి చెట్టుకు ఓ ఉరివేసుకుని చనిపోయాడంటూ సమాచారం అందగా ఆ స్ధలాన్ని పరిశీలించిన పోలీసులు ఉరివేసుకున్నది లక్ష్మీ రాజ్యంగా నిర్ధారించారు. పోలీసుల నుంచి తను తప్పించుకోలేనని, భావించి అతడు ఉరి వేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.