ఎంత‌మంచివాడ‌వురా సినిమా టైటిల్ విష‌యంలో ఏం జ‌రిగిందంటే?


నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఎప్ప‌టి నుంచో సంక్రాంతికి రావాల‌నుకున్నా ఈ సారి కుదిరింది.  `ఎంత‌మంచివాడ‌వురా` అంటూ నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌, మెహ్రీన్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రం స‌తీశ్ వేగ్నేశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్  చిత్రం గా ఉండ‌బోతుంది. ఈ చిత్రం పండుగ రోజున అంటే సంక్రాంతిరోజున 15వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు, ట్రైలర్‌లకు మంచి టాక్ రావడంతో సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలే  నెల‌కొన్నాయి.
అయితే ఈ సినిమా రిలీజ్‌కి రెండు రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్రబృందం జోరును పెంచింది. అందులో భాగంగానే హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… అస‌లు ఈ సినిమాకి ముందు ‘ఆల్ ఈజ్ వెల్’ అనే టైటిల్‌ను అనుకున్నారని అయితే ఫ్యామిలీ ఎంటర్‌టైన్ సినిమా కావడంతో కాస్త తెలుగుదనంతో ఉన్న‌ టైటిల్ అయితే బావుంటుంద‌ని భావించిన‌ట్లు చివరకు `ఎంత మంచివాడవురా` అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలిపారు.


Leave a Reply

Your email address will not be published.