జనవరి నుండి భారీగా పెరగనున్న హుందాయ్ కార్ల ధరలు …

భారీగా పెరుగుతున్న ఖర్చులు కారణంగా హుందాయ్ కార్ల ధరలను జనవరి నుండి పెంచుతున్నట్టు మోటార్ హుందాయ్ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ ఓ ప్రకటన విడుదల చేస్తూతప్పని సరిపరిస్థితిలోనే ధరలు పెంచాల్సి వస్తోందని ప్రకటించింది. అయితే ఎంత మేర ఈ ధరలను పెంచు తున్నది మాత్రం వెల్లడించలేదు. కానీ మోడల్స్, ఇంధన రకాలను ఆధారంగా దరల పెరుగుదల మారుతుందని సంస్థ తెలిపింది.
కాగా ఇప్పటికే ద్విచక్ర వాహన సంస్థ హీరోమోటోకార్ప్ కూడా జనవరి 1 నుంచి మోటారు సైకిళ్ళు, స్కూటర్ల ధరను రూ . 2,000 పెంచనున్నట్లు తెలపగా మారుతి సుజుకి, టాటా మోటార్స్ కూడా జనవరి నుంచి ధరలను పెంచనున్నట్టు ప్రకటించాయి.
ఇక సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ (సియామ్) ఆటో అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే, గత నెలలో 1,60,306 కార్లు సేల్ కాగా, గత ఏడాది నవంబర్లో 1,79,783 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనిప్రకారం కార్ల అమ్మకాలు 10.83% తగ్గాయని మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. అలాగే మోటారు సైకిళ్ల అమ్మకాలు 14.87% తగ్గాయని, గత నెలలో 8,93,538 యూనిట్లు, 2018 నవంబర్లో ఈ సంఖ్య 10,49,651 యూనిట్లుగా ఉందని వెల్లడించాయి.