ఉత్త‌మ జ్యూరీ అవార్డు అందుకుంన్న స‌మంత‌

గత ఏడాది చిత్రపరిశ్రమను సమంత ఓ ఊపు ఊపింది. తెలుగు , తమిళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి ఔరా ఔరా అనిపించింది. తన అభిమానులను తల ఎత్తుకొనేలా గర్వంగా తన చిత్రాలతో చాటి చెబుతోంది.  రొమాంటిక్ చిత్రాలే కాక చక్కటి కథ, స్క్రీన్ ప్లే ఉన్న సినిమాల్లో నటిస్తూ తన నటన కౌశల్యంతో చిత్రపరిశ్రమకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుంది.   గత ఏడాది వచ్చిన  యూ రిటర్న్స్, ఓ బేబీ, మజిలీ, తమిళంలో వచ్చిన సూపర్ డీలక్స్ సినిమాలతో తన నటన అభినయంతో ఆకట్టుకుంది.  

సూపర్ డీలక్స్‌లో షోషించిన పాత్ర సమంతకు ఎంతో ప్రత్యేక మైనది. ఈసినిమాలో నటించినందుకు గానూ సమంతకు పేరు పేరున అభినందనలు తెలిపారు. అంతేగాకుండా ఈ చిత్రంలో ట్రాన్స్‌జెండ‌ర్‌గా విజ‌య్ సేతుప‌తి అద్భుతమైన నటనను కనబరిచారు.  తాజాగా సూప‌ర్ డీల‌క్స్ చిత్రానికి గానూ జీ నిర్వ‌హించిన అవార్డు కార్య‌క్ర‌మంలో ఉత్త‌మ జ్యూరీ అవార్డు అందుకుంది స‌మంత‌. ఈ వేడుక‌లో చైన్నె అందం త‌న చీర‌క‌ట్టుతో అంద‌రి క‌ళ్లు త‌న‌వైపుకి తిప్పుకునేలా చేసింది. ప్ర‌స్తుతం ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌తో పాటు 96 రీమేక్ చిత్రం చేస్తుంది లీడ్ రోల్ పోషిస్తోంది. స‌మంత‌.  

Leave a Reply

Your email address will not be published.