“పరీక్ష పే చర్చా” 2020 కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్ర‌ధాని

రానున్న‌ది ప‌రీక్షాకాలం. ఈ సంవ‌త్స‌రాంత పరీక్షల్లో  విద్యార్దులు వ‌త్తిడికి గురికావ‌టం ఖాయం ఒత్తిడులకు విద్యార్థులు గురి కాకుండా ఉండేందుకు వారితో విలువైన అభిప్రాయాలపై చర్చించడానికి ప్రధాని మోదీ సోమవారం “పరీక్ష పే చర్చా” 2020 కార్యక్రమంలో ఆయ‌న  పాల్గొన్నారు. ఢిల్లీలోని టల్కటోరా ఇండోర్ స్టేడియంలో సోమవారం ఉదయం 11 గంటలకు జ‌రిగిన  ఈ కార్యక్రమం జరుగుతుంది. వ్యాస రచన పోటీ ద్వారా 1050 మంది  ఎంపికయిన విద్యార్ధులు పాల్గొంటారు. అలాగే  ఇత‌ర విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిపి మొత్తం 2000 మంది పాల్గొన్నారు.,
గత మూడు సంవత్సరాలుగా పరీక్షా పే చర్చా అనే కార్యక్రమంలో ప్రధానితో విద్యార్థుల సంభాషణ, వివిధ అంశాలపై చర్చ నిర్వ‌హిస్తున్నారు.  వాస్త‌వానికి. ఈ కార్యక్రమం  జనవరి 16 న జరగాల్సి ఉన్న‌ప్ప‌టికీ  పొంగల్, మకర సంక్రాంతి, లోహ్రీ, ఓనం  త‌దిత‌ర ఉత్సవాల కారణంగా జనవరి 20న నిర్వ‌హించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా కలిసి  ప‌లు అంశాల‌పై ప్ర‌శ్నించేందుకు వీలుగా 9 నుండి 12 తరగతుల విద్యార్థులకు  మావవనరుల మంత్రిత్వ శాఖ ఓ వ్యాస‌ర‌చ‌న పోటీ పెట్టి ఎంపిక చేసిన విష‌యం విదిత‌మే.   ఐఐటి ఖరగ్‌పూర్, కేంద్రీయ విద్యాలయ సంఘటన్, ఎన్‌ఐఓఎస్ వంటి అత్యున్నతస్థాయి గల సంస్థలు ఈ కార్యక్రమం గురించి ట్వీట్ చేయగా, దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు ఈ కార్యక్రమం గురించి పెద్ద ఎత్తున స్పందించి త‌మ విద్యార్ధుల‌ను ఈ కార్య‌క్ర‌మానికి సిద్దం చేసాయి.
సోమ‌వారం జ‌రిగిన  “పరీక్ష పే చర్చా” 2020 కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్ర‌ధాని ప‌లు అంశాల‌పై విద్యార్దులు అడిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిచ్చారు. ప‌రీక్ష‌ల‌లో వ‌త్తిడిని ఎలా ఎదుర్కొనాలో వివ‌రించి వారిని ఉత్తేజితుల‌ని చేసారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎంపిక‌యిన వారే కాకుండా దేశంలోని అన్ని విద్యా సంస్ధ‌లు ఈ సూచ‌న‌లు పాటించ‌డం ద్వారా వ‌త్తిడిని దూరం చేయాల‌ని ఆయ‌న సూచించారు.


Leave a Reply

Your email address will not be published.