అత్యాచారాలు చేసిన వైసీపీ నేతలపై చర్యలేవి ?

పరిపాలన అంటే పక్కరాష్ట్రానికి వెళ్లి సలహాలు తెచ్చుకోవడం కాదని తెలుగుదేశం నేత, సినీ నటి దివ్యవాణి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆమె మీడియాలో మాట్లాడుతూ… అత్యాచారం జరిగితే ఆ నిందితులను 21రోజుల్లో శిక్షిస్తామని జగన్ శాసన సభ సాక్షిగా ప్రకటించారని, మరి అత్యాచారాలు చేసిన వైసీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో శాసనసభలోనే జగన్ వివరిస్తారా? అని ప్రశ్నించారు. విపక్ష నేతలపై విరుచుకు పడే మహిళా మంత్రులు రాష్ట్రంలో కొనసాగుతున్న అత్యాచారాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని, చట్టం అమలు చేయలేక పోతున్న ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నట్టున్నారని ఎద్దేవా చేసారు. దిశ చట్టం తెచ్చి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం చేతలుడిగి చూస్తున్నందునే ఏపీలో ఎంతో మంది దిశల హత్యలు జరుగుతున్నాయని దివ్యవాణి మండిపడ్డారు.