ఆ ద‌ర్శ‌కుడు నా భుజాల‌పై చేతులేసీ….

మీటూ ఉద్య‌మం హాలీవుడ్‌లో ప్రారంభ‌మై  బాలీవుడ్  మీదుగా ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ వైపు కూడా ప‌రుగులు తీసింది. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో స‌హా ర‌చ‌యిత‌లు, న‌టుల‌పై వ‌స్తున్న ఆరోప‌న‌లు అన్నీ ఇన్నీ కావు. తాజాగా  ప్ర‌ముఖ బెంగాళీ ద‌ర్శ‌కుడు అరిందం సిల్ త‌ను లైంగికంగా వేధించాడ‌ని న‌టి రూపాంజ‌న మిత్ర  ఆరోప‌ణ‌లు చేసింది.  భూమిక‌న్య అనే సినిమా  స్క్రిప్ట్‌పై త‌న‌తో చ‌ర్చించాల‌ని త‌న‌ని ఆఫీసు ఆహ్వానించి స్క్రిప్ట్ ఇచ్చి  చ‌ద‌మ‌ని చెప్పి…  అక్క‌డెవ‌రూ లేక‌పోవ‌డంతో  ద‌ర్శ‌కుడు లేచి నా ముఖం, భుజాన్ని నిమిరాడని,  అత్యాచారం చేస్తాడ‌న్న భ‌యంలో   ఆ గ‌దిలోకి ఎవ‌రైనా రావాల‌ని  కేక‌లు వేసిన‌ట్టు ఈ మ‌ధ్య ఓటివి ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వూలో చెప్పుకొచ్చింది. 

 . `నాతో స్క్రిప్ట్ గురించే మాట్లాడాలి… ఇలాంటివి చెల్ల‌వు అంటూ గట్టిగా  కేక‌లు వేసేస‌రికి ఆత‌ని ఎత్తుగ‌డ‌లు నా ద‌గ్గ‌ర ప‌నిచేయ‌వ‌ని   అర్థ‌మై,   స్క్రిప్ట్ గురించి  మాట్లాడుతున్న క్ర‌మంలో  ఆయ‌న భార్య  రావ‌టంతో బయట పడ్డా..  ఛాన‌ల్‌తో ఉన్న ఒప్పందం ప్ర‌కారం ఆ విష‌యాన్ని అప్పుడు ద‌ర్శ‌కుడి నిర్వాకాన్ని బైట‌కు చెప్ప‌లేక‌పోయానని ఆమె తెలిపారు.

 అయితే ద‌ర్శ‌కుడు అరింద‌ల్  ఆమె వ్యాఖ్యాల‌ను ఖండిస్తూ,   ఆమె ఎందుకలా చెప్పారో నాకు ఇప్ప‌టికీ  అర్థం కావ‌డం లేదు.   నేను వేధించాన‌ని చెప్పిన రోజు నేను చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉన్నాన‌ని ఆమె మెసేజ్ పెట్టిందంటూ మీడియాకు చెప్పుకొచ్చారు. ఈ విష‌య‌మై సినీ ప్ర‌ముఖులు కూడా స్పందించే ఆస్కారం క‌నిపిస్తోంది. 

Leave a Reply

Your email address will not be published.