బీసీల జనాభా ఎంతో లెక్కకట్టాలి : ఆర్‌. కృష్ణ‌య్య‌.స్వాతంత్య్రం లభించి 72 సంవత్సరాలు గడిచిన  56 శాతం జనాభా గల బిసీలకు రాజ్యాంగ బద్ధమైన హక్కులు  కల్పించడం లేద‌ని మండి ప‌డ్డారు బిసి సంఘాల నేత ఆర్‌. కృష్ణ‌య్య‌. ఈ మేర‌కు ఆయ‌న మీడియాకు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ, ఇన్నాళ్లు ప్ర‌భుత్వాల‌న్ని జ‌నాభాలో స‌గం ఉన్న బిసీల‌కు త‌గిన‌ బడ్జెట్ కేటాయించకుండా,  వారి అభివృద్ధికి త‌గిన స్కీములు ప్ర‌వేశ‌ పెట్టకుండా అన్యాయం చేస్తునే ఉన్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. .ప్రధానమంత్రి బి.సి అయిఉండి కూడా బీసీల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని, చివరకు బీసీల జనాభా ఎంతో లెక్కించడానికి కూడా ప్ర‌భుత్వాలు ఇష్టపడడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

ఈ ప‌రిస్థితిని మార్చేందుకు జ్యాంగబద్ధమైన రాజకీయ రిజర్వేషన్లు శ‌ర‌ణ్య‌మ‌ని వాటిని  సాధించేందుకు రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలు, రాజకీయపార్టీలలో ఉన్న బీసీ నాయకులు కలసికట్టుగా పెద్దఎత్తున ఉద్యమించదానికి సన్నద్ధంకావాలని పిలుపునిచ్చారు.  

ఈ సంద‌ర్భంగా పార్లమెంటులోబిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని జాతీయ బీసీసంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చేస్తున్న ఉద్యమానికి పెద్దఎత్తున వివిధబీసీ నాయకులు హైదరాబాదులోని బీసీ భవన్ కు వచ్చి మద్దతు తెలిపారు. 

 

Leave a Reply

Your email address will not be published.