ట్రంప్‌లో వచ్చిన మార్పులపై చర్చ …

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన కు కుటుంబంతో సహా సోమవారం వచ్చేసి సబర్మతీ ఆశ్రమం, తాజ్, మోరాటే స్టేడియంలో ఇలా తెగ బిజీ బిజీగా గడిపి ఢిల్లీలో రెస్టు తీసుకున్నారు. మంగళవారం కూడా వారి పర్యటన కొనసాగుతోంది.
అయితే ట్రంప్ అమెరికాలో బయలు దేరిన క్షణం నుంచి ఇండియాలో దిగిన వరకు ప్రత్యక్ష ప్రసారాలని పరిశీలించిన నెటిజన్లు ట్రంప్‌లో వచ్చిన మార్పులపై చర్చించుకోవటం గమనార్హం. ఎక్కువగా ట్రంప్ రెడ్ కలర్ టై లో మనకి కనిపిస్తారు. అలాగే ఆయన అమెరికా నుంచి బయలుదేరే సమయంలోనూ ఇదే రెడ్టై కట్టుకుని వైట్ షర్ట్, రాయల్ బ్లూ కలర్ ప్యాంట్, బ్లూ కలర్ కోట్ ధరించి విమానం ఎక్కారు. అయితే భారత్‌లో ఫ్లైట్ ల్యాండ్ అయిదిగి వచ్చిన ప్పుడు బ్లాక్ సూట్ ధరించడంతో పాటు రెడ్ టై బదులు పసుపు కలర్ టై ధరించి కనిపించారు. అటు మెలానియా తన బ్లాక్ డ్రెస్ బదులుగా వైట్ డ్రెస్‌లో కనిపించారు.
కాగా, ట్రంప్ పసుపు కలర్ టై వెనుక సామాజిక మీడియాలో పుంఖనాలు పుంఖనాలుగా వార్తలు వండి వార్చేస్తున్నారు నెటిజన్లు. వాటిలో కొంత వాస్తవికత కూడా కనిపిస్తోంది. పసుపు రంగు ఆనందానికి ప్రతీక అని హిందువుల్లో ఈ రంగుకు ఇచ్చే ప్రాముఖ్యత దృష్ట్యా ట్రంప్ వారిని ఆకర్షించేందుకు టైరంగు మార్చాడని కొందరంటే… పసుపు రంగు వెచ్చదనానికి, ప్రకాశవంతానికి ప్రతీకగా మరికొందరు పేర్కొన్నారు. ఇంకొందరు ఈ రంగు తెలివికి ప్రతీకగా చెపుతూ భారత్‌తో స్నేహ బంధం బలంగా నిలిచేందుకు సంకేతంగా ఈ పసుపు రంగు టై ని ట్రంప్ కట్టుకున్నారంటూ చెప్పుకొచ్చారు. మరి ట్రంప్ పసుపు రంగు టై కట్టుకోవడం వెనుక ఇంత సందేశం ఉందా? అనిపించక మానదు.
మెలానియా ధరించిన తెలుపు రంగు దుస్తులు శాంతికి ప్రతీకగా అభివర్ణిస్తూ పలు కథనాలు వచ్చాయి.