విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ …

అల్లరి చిత్రంతో తనకంటూ ఓ ప్రత్యేకత నిలుపుకున్న నరేష్ ఆ చిత్రంతో అల్లరి నరేష్‌గా మారిపోయి, ఇండస్ట్రీలో పలు చిత్రాలలో హీరోగా, సహాయనటుడిగా సత్తా చాటుకున్నాడు. గత కొంత కాలంగా అడపా దడపా సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్ దర్శకత్వంపై మక్కువతో తన తండ్రి ఇవివి సత్యనారాయణలో ఓ కామెడీ సినిమాకు తగిన హంగులు సమకూర్చుకునే పనిలో ఉన్నాడని సమాచారం. ఈవివి సినిమా బేనర్‌పై అల్లరి నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా తాజాగా అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మాణం ఆదివారం ఉదయం హైదరాబాద్ డా.రామానాయుడు స్టూడియోస్‌లో ఆరంభం కానుంది. సతీష్ వేశాగ్న తన ఎస్వి 2 పతాకంపై నిర్మించే ఈ చిత్రం శరవేగంతో పూర్తి చేసి వేసవి కానుకగా విడుదల కానున్నట్టు చిత్ర యూనిట్ చెప్పింది.