మోకాలి ఆప‌రేష‌న్ చేయించుకునేందుకు సిద్ధమైన మహేష్ ….వ‌రుస సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా  ఏమాత్రం ఖాళీ దొరికినా ఫ్యామిలీ కే కేటాయించి వారంద‌రినీ విదేశాల‌కు తీసుకు వెళ్తుంటాడు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు. తాజాగా   `స‌రిలేరు నీకెవ్వ‌రు` భారీ విజయాన్ని అందుకొన్నాక‌, ఆ సినిమాకు మ‌రిన్ని కామెడీ దృశ్యాల చిత్రీక‌ర‌ణ‌తో పాటు  ప్ర‌మోష‌న్స్ లోనూ పాల్గొని కుటుంబంతో స‌హా అమెరికా  చెక్కేసాడు. అయ‌న త‌న‌ భార్య పిల్ల‌ల‌తో  రెండు నెల‌లు పాటు అమెరికాలో వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తాడ‌ని అంతా చెపుతుంటే అందుకు త‌గ్గ‌ట్టే మ‌హేష్‌, నర్మ‌త‌లు  పెడుతున్న‌ ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయిప్పుడు.

అయితే ఆగ‌డు సమయంలో  మోకాలి గాయంకాగా గ‌త కొంత కాలంగా అది ఇబ్బంది పెడుతోంద‌ని, స‌రిలేరు నీకెవ్వ‌రు స‌మ‌యంలోనే ఫ్యామిలీ వైద్యుడు ప‌రిశీలించి మోకాలి ఆప‌రేష‌న్ చేయించుకోవాల‌ని సూచించార‌ట‌.  దీంతో  మ‌హేశ్ అమెరికాకు వెళ్లి మోకాలి ఆప‌రేష‌న్ చేయించుకునేందుకు సిద్ద‌మయ్యాడ‌ట‌.  అమెరికాలో రెండు నెల‌ల పాటు విశ్రాంతి తీసుకున్న అనంత‌రం ఇక్క‌డికి వ‌చ్చి మ‌రి రెండు నెల‌లు షూటింగ్‌ల‌కి దూరంగా ఉండే ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది.   త‌ర్వాత   వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో  దిల్‌రాజు నిర్మించ‌నున్న చిత్రంలో మ‌హేష్ పాల్గొంటారు.  Leave a Reply

Your email address will not be published.