‘ఫ్రెండ్ షిప్’ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌


తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్‌ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించిన ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్   క్రికెట్  కి గుడ్ బై చెప్పి  పలు కంపెనీలను ప్రమోట్ చేయడం ప్ర‌క‌ట‌న‌ల‌లో న‌టిస్తున్నాడు . తాజాగా  ఓ త‌మిళ సినిమాలో హీరోగా నటించేందుకు  సిద్ద‌మ‌య్యాడు హ‌ర్భ‌జ‌న్‌.  తమిళంలో ‘ఫ్రెండ్ షిప్’   టైటిల్ తో రూపొందే ఈ సినిమా లో లో హీరోయిన్‌గా బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మ‌రియ‌నేస‌న్ ని ఎంపిక చేసారు. అలాగే  ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక ఈ సినిమాని. సీన్‌టొ స్టూడియోస్‌, సినీ మాస్ స్టూడియోస్ ప‌తాకాల‌పై జెపిఆర్‌&స్టాలిన్  లు నిర్మిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ల‌ర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్‌. రెండు చేతులకి ఒకే సంకెళ్లు వేసి ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెంచింది. పాన్ ఇండియా సినిమాగా ర‌డీ అయ్యే ఈ చిత్రాన్ని అన్ని భార‌తీయ భాషల్లో విడుదల చేస్తామ‌ని నిర్మాత‌లు చెప్పారు.  ఈ చిత్రానికి    నటీనటుల ఎంపిక జ‌రుగుతోందని, సాంకేతీక నిపుణుల ఎంపిక కూడా పూర్తి కావాల్సి ఉంద‌ని, ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు త్వరలో మీడియాకు వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు.  శ‌ర‌వేగంతో ఈ సినిమా నిర్మాణం పూర్తి చేసి   సమ్మర్ స్పెష‌ల్‌గా విడుద‌ల‌చేస్తామ‌ని వివ‌రించారు. 
 

Leave a Reply

Your email address will not be published.