జులై లో విడుదలకు సిద్దమౌతున్న ఆర్ ఆర్ ఆర్


కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జూలైలో విడుద‌ల చేసేందుకు నిర్మాత  డీవీవీ దానయ్య సిద్ద‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే దర్శక ధీరుడు రాజమౌళి ఎన్టీఆర్‌తో యాక్షన్ సీన్స్ పూర్తి చేసారు. రామ్ చరణ్ సరసన సీత పాత్రలో హిందీ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండ‌గా ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఒలీవియాను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. ఇప్ప‌టికే  వీరి మ‌ధ్య‌ లవ్ సీన్స్, కొన్ని కీ సీన్స్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.


కొత్త ఏడాదిలో ఫ్రెష్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన రాజమౌళి  హైదరాబాద్‌లో జెంట్ ఫారిన్ బ్యూటీ ఒలీవియా మోరిస్‌తో యంగ్ టైగర్ఎన్టీఆర్ తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తు న్నారు. ఒలీవియా కొంత విరామం తర్వాత మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటున్న‌ట్టు స‌మాచారం.  అజయ్ దేవగణ్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాను  ఈ ఏడాది జూలై నెలాఖరున విడుదల చేసేలా  ప్లాన్ ప్రకారం షూటింగ్ చేస్తున్నారని యూనిట్ వ‌ర్గాలు చెపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.