కొత్త‌పాట‌తో ఫ్యాన్స్‌కి చ‌మ‌ట‌లు ప‌ట్టిస్తున్న సన్నీ…!


స‌న్నీలియోన్ ఈ పేరు వింటే చాలు కుర్రాళ్ళ గుండెల్లో రైళ్ళు ప‌రుగెడ‌తాయి. ఈ ఒక్క పేరు చాలు బాక్సాఫీస్ షేక్ అయిపోవ‌డానికి. సినిమా ఎలా ఉంద‌నే మాట‌తో వాళ్ల‌కు ప‌నిలేదు.. స‌న్నీ సినిమా అంటే ఎలా ఉన్నా కూడా నిర్మాత‌ల‌కు వ‌ర్క‌వుట్ అవుతుందంతే. అదే ఆమెలో ఉన్న ప్ర‌త్యేక‌త‌. స‌న్నీ కోస‌మే సినిమాకు వెళ్లే ఆడియ‌న్స్ ల‌క్ష‌ల్లో ఉంటారు. అందుకే ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా కూడా స‌న్నీలియోన్ క్రేజ్ మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఇక ఈమెను తెలుగు ఇండ‌స్ట్రీకి తీసుకురావ‌డానికి.. ఇక్క‌డ ఆమెతో సినిమాలు చేయ‌డానికి మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా బాగానే ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఇటీవ‌లె స‌న్నీ హ‌ల్లో జీ అంటూ ఓ ఐటెమ్ సాంగ్‌తో కుర్రాళ్ళ మ‌తిపోగొడుతుంది. సన్నీ ప్రధాన పాత్రలో ‘రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్ సీజన్ 2’ అనే వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. ప్రముఖ బాలీవుడ్ గాయని కనికా కపూర్ ఈ పాటను పాడారు. ఈ పాట వీడియోను తాజాగా విడుదల చేశారు. ఏఎల్‌టీ బాలాజీ సంస్థ బ్యానర్‌పై ఏక్తా కపూర్ ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రముఖ నటుడు నవదీప్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ పాట విషయానికొస్తే.. అదిరిపోయే డ్రెస్సుల్లో సన్నీ స్టెప్పులతో అదరగొట్టింది.

‘హల్లో జీ’ అంటూ సాగుతున్న ఈ పాటలో సన్నీ తన అంద‌చందాల‌తో,  స్టెప్పులతో సెగలు పుట్టిస్తోంది. ఐటెం సాంగ్స్‌కి పెట్టింది పేరు సన్నీ. సన్నీ చేసే ఐటెం సాంగ్స్‌కు మార్కెట్‌లో ఉండే డిమాండే వేరు. పాట విడుదలైన నిమిషంలోనే 26వేల మందికి పైగా దీనిని వీక్షించారు. ఇలాంటి సాంగ్స్‌తోనే సన్నీ బాలీవుడ్‌లో పాపులర్ అయింది. ఇక ఫ్యాన్స్‌కి ఈ పాటను చూడగానే నిద్రపట్టదేమో. అన్న‌ట్లు ఉన్నాయి స‌న్నీ స్టెప్పులు. బాలీవుడ్‌లో కేవలం ఐటెం సాంగ్స్‌ చేసేవారు ముగ్గురే ఉన్నారు. . వారిలో మలైకా అరోరా ఖాన్, నోరా ఫతేహి, సన్నీ లియోన్. ‘ఛయ్య ఛయ్య’ పాటతో మలైకా ఎప్పుడో తనని తాను ప్రూవ్ చేసేసుకున్నారు. నోరా ఫతేహీ కూడా గట్టి పోటీనిస్తున్నారు. కానీ సన్నీ లియోన్‌కు మాత్రం ఆమెకు ఆమే పోటీ అని నిరూపించారు. 

Leave a Reply

Your email address will not be published.