ప్రధాని మోది వ్యాఖ్యలపై యనమల ఆగ్రహం

మోది దోపిడి పాలనకు వ్యతిరేకంగానే కోల్ కత్తా ర్యాలీ ని నిర్వహించారని  దేశంలో మోదిపై వ్యతిరేకతకు కోల్ కత్తా ర్యాలీ అద్దంపట్టింది. ఒక పత్రికా ప్రకటనలో మోదిపై ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు
కోల్ కత్తాలో యునైటెడ్ ఇండియా ర్యాలీ చూసి బిజెపి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు
 22పార్టీల నేతలను ఒకే వేదికపై చూసి నరేంద్ర మోది బెంబేలెత్తుతున్నారు
‘సిల్వసా’ లో చేసిన వ్యాఖ్యలు మోది భయానికి నిదర్శనం అని యనమల అన్నారు
దోపిడీదార్లంతా ఒక్కటయ్యారని మోది అనడం దివాలాకోరుతనం.
రాఫెల్ కన్నా పెద్ద దోపిడి ఏం ఉంది..? రూ.43వేల కోట్ల దోపిడి మోది ఘనత కాదా..? వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టడం వెనుక ఉందెవరు..? నీరవ్ మోది, చోక్సీ, సండేసరా వేల కోట్లు ఎగ్గొట్టారు. మోసగాళ్ల పరారీ వెనుక హస్తం ఎవరిది..? అరుణ్ జైట్లీకి చెప్పే వెళ్లానని మాల్యా పేర్కొనలేదా..?
దోపిడీదార్ల గురించి మోది మాట్లాడటం హాస్యాస్పదం. తోడుదొంగలంతా బిజెపిలోనే ఉన్నారు.
రాఫెల్ పై సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించారు. రాఫెల్ విమానాల ధరలు 41% అధికంగా నిర్ణయించారు. 14%మాత్రమే ఎక్కువ ధర పెట్టామని అన్నా నమ్మే పరిస్థితి లేదు. విమానాల ధరలు పెంచినట్లుగా ఒప్పుకున్నారు. ప్రజలకు సంజాయిషి ఇవ్వాల్సిన  దుస్థితికి మోది చేరారు.
పతనం అంచున బిజెపి ప్రభుత్వం ఉంది. అందుకే అసహనం నరేంద్రమోదిలో కనిపిస్తోంది.
పెద్దనోట్ల రద్దును కుంభకోణంగా మార్చింది బిజెపి నే. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పొగొట్టారుఅని ఆర్ధిక మంత్రి ధ్వజమెత్తారు.
మోది దోపిడి పాలనకు వ్యతిరేకంగానే కోల్ కత్తా ర్యాలీ. దేశంలో మోదిపై వ్యతిరేకతకు కోల్ కత్తా ర్యాలీ అద్దంపట్టిందని . లోక్ పాల్ బిల్లులో 5ఏళ్లు జాప్యం మోది దోపిడి పాలనకు నిదర్శనం అని ఆయన అన్నారు 
అన్నాహజారే 32లేఖలు బుట్టదాఖలు చేసింది మోది కాదా..?
జనవరి 30న హజారే దీక్షకు దిగడం మోది వైఫల్యం కాదా..?
దాడులతో అన్నివర్గాల ప్రజల్లో అభద్రత మోది పెంచారు. బిసి,ఎస్సీ,ఎస్టీ,ముస్లింలలో బిజెపిపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు
రాబోయే ఎన్నికల్లో దేశంలో ప్రజాస్వామ్యానికి, మోది నియంతృత్వానికి పోటి.
ఏది కావాలో ప్రజలే నిర్ణయిస్తారు.
రాష్ట్రంలో చంద్రబాబు నీతివంతమైన పాలనకు, జగన్ అవినీతి కుంభకోణాలకు మధ్య పోటి.
ఈ ఎన్నికల్లో అంతిమ విజయం ధర్మానిదే. యనమల రామకృష్ణుడు తెలియజేయసారు

Leave a Reply

Your email address will not be published.