అదే హోటల్ రూమ్‌లో ఉంటే పిలిపించా…

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – నాగార్జునల కాంబినేషన్లో వచ్చిన సూపర్ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన అనుష్క అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అనుష్క సినీ ప్రస్థానంలో 15 ఏళ్లు గడచిన సందర్భంగా 15 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఆఫ్ అనుష్క పేరుతో నిశ్శబ్దం చిత్రయూనిట్ ఓ కార్యక్రమం నిర్వహించింది. అతిరథ మహారధుల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘ తొలిసారి అనుష్క రామదాసు లో నటించింది. ఆమె నటన తీరు చూసి సౌతిండియాలో స్టార్ హీరోయిన్ అవుతుందని చెప్పాను. దివంగత కోడి రామకృష్ణ , శ్యాంప్రసాద్ రెడ్డి లు అరుంధతితో అనుష్కకి గజకేసరి యోగం పట్టించారు. అనుష్కను వెతుక్కుంటూ క్యారెక్టర్స్ వచ్చాయి. ఈ జనరేషన్లో ఏ హీరోయిన్‌కి దక్కని అదృష్టం అనుష్కకి దక్కింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అభిమానులను సంపాదించుకుంది. నిశ్శబ్దంలో అనుష్క క్యారెక్టర్ బాగుందని ’’ అన్నారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ – ‘‘సూపర్ సినిమాలో కొత్త హీరోయిన్ కోసం ముంబై వెళ్లినప్పుడు ఓ మిత్రుడు కోసం హోటల్లో వెయిట్ చేస్తున్నప్పుడు అనుష్క కనిపించింది. తను సినిమా పక్షి కాదని అర్థమైంది. నన్ను నేను పరిచయం చేసుకుని యాక్టింగ్ వచ్చా? అని అడిగాను. ఎప్పుడూ ట్రై చేయలేదు. చేస్తానో లేదో డాన్స్ కూడా రాదని చెప్పింది. పోనీనా సినిమాలో చెయ్యగలవా? అని ఫోటో ఇవ్వమంటే తను స్టాంప్ సైజ్ కన్నా చిన్న ఫొటోను ఇచ్చింది. మా ఆవిడ ఫోటో చూసి, అదే హోటల్ రూమ్‌లో ఉంటే పిలిపించా. అమ్మాయి పొడవుగా బావుందని, సినిమాలకి సూటవుతుందని అంది. ఏం చేస్తున్నావంటే నేనొక యోగా టీచర్ని అంది. మాతో సినిమాలో నటిస్తావా? హైదరాబాద్‌కి రాగలవా? అంటే కలసి వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోకి తీసుకెళ్లా! నాగార్జున గారిని పరిచయం చేయగానే అమ్మాయి చాలా బావుందన్నారు. ఆడిషన్ వద్దు నేరుగా సినిమాలో యాక్ట్ చేయించేద్దామని అన్నారు. వినోద్ బాల యాక్టింగ్ నేర్చుకుంది స్వీటికీ అనుష్క అనే నామకరణం చేశాం. మంచి తనం, తెలివి తేటలు కలిసిన రూపం సూపర్‌తో స్టార్ట్ అయ్యి.. సూపర్ స్టార్‌గా ఎదిగింది. నిశ్శబ్దం సినిమా లో అనుష్క మూగ అమ్మాయి రోల్ చాలా బాగా వచ్చింది. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు.
స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి మాట్లాడుతూ – ‘‘నేను ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు అయ్యిందని ఈ సెలబ్రేషన్ చేస్తున్నారు. కానీ నాకన్నా ముందున్న వారితో పోలిస్తే నా పయనం చాలా చిన్నది. సినిమా అన్నది ఓ బాధ్యత ఇంకా బెటర్ స్క్రిప్ట్ ఉన్న సినిమాలు చేయడానికి చూస్తాను ఈ ప్రయాణంలో నాకు సహకరించిన అందరికీ థాంక్స్. ‘నిశ్శబ్దం’లో మా బెస్ట్‌ను ఇచ్చాం. ఏప్రిల్ 2 న వస్తున్న సినిమా ఆదరించడండి ’’ అన్నారు
ఈ కార్యక్రమంలో హీరోయిన్లు అంజలి, ఛార్మి , నిర్మాతలు డి.సురేష్‌బాబు, పీవీపీ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ , కోన వెంకట్ , శ్యామ్ ప్రసాద్ రెడ్డి, విశ్వప్రసాద్ దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి , శ్రీవాస్ , కె.దశరథ్ , వీరుపోట్ల, వైవీయస్ చౌదరి , చిత్ర డైరెక్టర్ హేమంత్ మధుకర్ తదితరులు మాట్లాడారు.