‘డిస్కోరాజా` హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెపిన మాస్ మహారాజ….

మాస్ మహారాజ రవితేజ తన జన్మదినం, రిపబ్లిక్డేలను పురస్కరించుకుని వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘డిస్కోరాజా` చిత్రాన్ని హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు . మాస్ మహారాజ రవితేజ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 26 హైదరాబాద్ ఆవాస హోటల్లో ఫ్రీకింగ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ను చిత్ర యూనిట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ యావత్తు పాల్గొంది.
ఈ సందర్భంగా రవితేజ మీడియాలో మాట్లాడుతూ… ప్రస్తుతం ఇండస్ట్రీలో రాక్ స్టార్తమన్, ఇప్పుడు ఆయనకి శుక్రమహాదశ శివతాండవం చేస్తోందని, వరుస విజయాలందుకుంటున్నారని వ్యాఖ్యానించారు. నా చిత్రాలకు ఎక్కువగా పని చేసిన అబ్బూరి రవి మంచి మిత్రుడు, అంతకు మించి నాకు చాలా ఇష్ట మయిన వ్యక్తులలో ఒకరు. బాబిసింహా పాత్ర మా అబ్బాయికి బాగా నచ్చేసిందంటే ఆయనెంత బాగా చేసారో అర్ధం చేసుకోవచ్చు. సునీల్ నేను చాలా చిత్రాల్లో నటించాం. కానీ ఈ సినిమాలో ఇద్దరివీ డిఫరెంట్ క్యారెక్టర్స్ మా పాత్రలకు మంచి పేరొచ్చింది. ఇక పాయల్ క్యారెక్టర్ లో లీనమై పోయింది. సినిమాకు ఘట్టమనేని కార్తిక్ సినిమాటోగ్రఫీ ప్రాణం పోసింది. నా పుట్టినరోజుకు ఇంత మంచి సక్సెస్‌ని ఇచ్చినందుకు ఆడియన్స్‌కి బిగ్ థ్యాంక్స్ అన్నారు.
రామ్ తాళ్ళూరి ప్రొడక్షన్‌పై సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో రజిని తాళ్లూరి నిర్మించిన డిస్కో రాజాలో నభా నటేష్, పాయల్ రాజ్‌పూత్, తాన్యహోప్ హీరోయిన్స్. జనవరి 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్స్ సాధిస్తున్న విషయం విదితమే..