ఉక్కుమ‌హిళ‌గా జయశ్రీ

ప్రతిభ వుండి ప్రణాళికాబద్ధంగా పరిశ్రమిస్తే…  సినిమానూ ఒక కెరీర్ గా మలచుకోవచ్చని, అద్భుతాలు ఆవిష్కరించవచ్చని నిరూపిస్తున్న న‌టీ మ‌ణుల‌లో జయశ్రీ రాచకొండ ఒక‌ర‌న‌టంలో సందేహ‌మేలేదు.  నాని నిర్మాత‌గా మారి నిర్మించిన ‘అ!స‌,  చేనేత కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన ‘మల్లేశం, బుర్రకథ, సీత ఆన్ ది రోడ్ చిత్రాల‌లో  తను పోషించిన‌వి చిన్న చిన్న పాత్రలే అయినా  మంచి న‌టిగా పేరు సంపాదించుకున్న జ‌య‌శ్రీ ఇవైపు త‌న న్యాయ‌వాద వృత్తిని కొన‌సాగిస్తునే, సినీరంగంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం అందుకుంటున్నారు. 

 ఈమె తాజాగా  ‘చదరంగం’ జీ-5 వెబ్ సిరీస్ లో ఆమె న‌టించిన పాత్ర నెటిజ‌న్ల‌ విశేష  ఆదరణ పొందుతోంది. ఇందులో ఈమె దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీని పోలిన ‘వసుంధర’ అనే ఓ పవర్ ఫుల్ పాత్ర తో  అందరి దృష్టినీ ఆకట్టుకునేలా న‌టించారు.  త‌ను న‌టించిన‌ ‘ప్రైమ్ మినిస్టర్’ పాత్ర కు అందుతున్న   ప్రశంసలన్నీ   ప్రశంసలన్నీ ఈ వెబ్ సిరీస్ దర్శకుడు ‘రాజ్ అనంత’కు చెందుతాయని విన‌మ్ర‌త‌తో చెప్పారామె. ఆయన చెప్పినట్లు నేను న‌టించి చూపించాన‌ని  ఇందుకు ప్ర‌ధానంగా జీ-5 క్రియేటివ్ హెడ్ ‘ప్రసాద్ నిమ్మకాయలస‌కు  కృతజ్ఞతలు తెలిపారు. 

ప్రపంచవ్యాప్తంగా ఉక్కుమ‌హిళ‌గా, రాజ‌కీయ నిర్ణ‌యాధికారాల‌లో తిరుగులేని నేత‌గా పేరుగాంచిన ఇందిరాగాంధీ లాంటి ఎన‌ర్జిటిక్‌ పవర్ ఫుల్ లీడర్ పాత్రను పోషించే అవకాశం త‌న‌కు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారామె… 

 ప్రస్తుతం ప్రముఖ దర్శకులు వి.ఎన్. ఆదిత్య రూపొందిస్తున్న ‘వాళ్ళిద్దరి మధ్య, విఠల్ వాడి’ చిత్రాలతోపాటు పాయల్ రాజ్ పుట్ ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కుతున్న ఇంకా పేరు పెట్టని హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంలోనూ నటిస్తున్న జయశ్రీ రాచకొండ ఈ చిత్రాలలోనూ ఎంతో ప్రాధాన్య‌త గ‌లిగిన పాత్ర‌లో పోషించాన‌ని, ఇవ‌న్నీ తనకు మరింత గుర్తింపు తీసుకువ‌స్తాయ‌న్న‌ ఆశాభావం వ్యక్తం చేసారామె.

Leave a Reply

Your email address will not be published.