పవన్ రాక కోసం ఎదురుచూస్తున్న రాజధాని రైతులు…

అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న ఆందోళన  20 రోజులు దాటిపోయింది.. ఇప్పటికే అమరావతి జెఎసి అనేది ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ ,కమ్యూనిస్టు పార్టీలు,జనసేన పార్టీ కూడా అమరావతి కి మద్దతు తెలియజేశాయి..మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,కమ్యూనిస్టు పార్టీ తరఫున రామకృష్ణ  ప్రత్యక్షంగానే ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇంతవరకూ జనసేన తరపున జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనలేదు..పవన్ కళ్యాణ్ రాజధాని రైతుల తరపున జనసేన కవాతు చేసిన పక్షంలో అమరావతి రాజధానిని తరలించే సాహసం ప్రభుత్వం చేయకపోవచ్చు.. ఎందుకంటే   జనసేనానికి ఉన్న ఫాలోయింగ్ అటువంటిది..సార్వత్రిక ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలిచిన జనసేనని రెండు సీట్లలో ఓడిపోయినా పవన్ కళ్యాణ్ కు మాత్రం జనంలో క్రేజ్ తగ్గలేదు..పవన్ కళ్యాణ్ ఎంట్రీతో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా రాజధాని రైతులకు జనసేనాని అండ ఎంతో ఉపయోగపడుతుంది అనడానికి ఏ మాత్రం సందేహం అవసరం లేదు..అందుకే అమరావతి రైతులులో పవన్ కళ్యాణ్ రావాలి మాకు న్యాయం జరగాలి అనే నినాదం కూడా లేకపోలేదు..

Leave a Reply

Your email address will not be published.