ఎలాంటి ట‌చ్చో తెలియాలి- అదితిరావు

మ‌న తెలుగు అమ్మాయి అదితి రావు హైదరీ. పుట్టింది ఆంధ్రప్రదేశ్‌, పెరిగింది ఉత్తర భారత్‌లో. తన సినీ కెరీర్ ఆరంభంలో బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. కానీ, నిలదొక్కుకోలేక పోయింది. ఆ తర్వాత ఆమె చూపు దక్షిణాదిపైవు మళ్లింది. తొలుత తెలుగు వెండితెరపై మెరిసింది. అది కూడా మణిరత్నం నిర్మించిన ‘చెలియా’ అనే డబ్బింగ్ చిత్రంతో అడుగుపెట్టింది. ఆ తర్వాత నారా రోహిత్ హీరోగా వచ్చిన ‘సమ్మోహనం’ చిత్రంతో ప్రతి ఒక్కరినీ సమ్మోహన పరిచింది.

అయితే, బాల్యంలో తనకు ఎదురైన ఓ అనుభవంపై ఆమె స్పందిస్తూ, తనకు బాల్యంలోనే జరిగిన ఓ బాధాక‌ర‌మైన‌ సంఘటనను గురించి మాట్లాడుతూ.. ‘‌నేను స్కూల్లో లోకల్‌ ట్రైన్‌లో వెడుతున్న సమయంలో ఓ పెద్దాయన నన్ను బాడ్‌గా టచ్‌ చేస్తూ వెళ్ళబోయాడు. వెంటనే ఆయన్ని ఆపి, ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయకండి అంటూ వార్నింగ్‌ ఇచ్చాను’ అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా, చిన్నవయస్సు నుంచి ఆడ పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటో పెద్దలు చెపుతుండాలని సలహా ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published.