దంపతులు కానున్న బాలీవుడ్ ప్రేమజంట

బాలీవుడ్ ప్రేమ పక్షులు అలియా భట్, రణబీర్ కపూర్ ఈ ఏడాది పెళ్లిచేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరి పెళ్ళికి ఇప్పటికే రెండు కుటుంబాలు ఏర్పాట్లు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు పెళ్ళికి ముందే హనీమూన్ వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేశారని  తెలుస్తోంది. అయితే హనీమూన్ కోసం ఈ జంట లొకేషన్స్ వెతికే పనిపై ఉన్నారంట. 
 స్విట్జర్లాండ్- బహామాస్- ఫిన్లాండ్ లోని అబ్బురపరిచే  ప్రదేశాలను వెతుకుతున్నారట. విలాసవంతమైన ఎగ్జోటిక్ రిసార్ట్ లొకేషన్లలో సందడి చేయాలని  ప్రేమ పావురాలు పథకం రచించారు. హనీమూన్ సరే కానీ.. కనీసం ఆ తర్వాత అయినా పెళ్లి ఉంటుందా ఉండదా అన్నదానికి మాత్రం ఆ ఇద్దరి నుంచి సరైన క్లారిటీ లేనే లేదు.  ఇక రణబీర్ తల్లిదండ్రులు రిషి .. నీతూ కపూర్ లకు చెందిన ఐకానిక్ కృష్ణ రాజ్ భవంతి పునర్ నిర్మాణం సాగుతోంది. ఈ భవనంలోనే రణ్ బీర్-అలియా కాపురం పెట్టబోతున్నట్టు  రూమర్లు వైరల్ అవతున్నాయి. 

Leave a Reply

Your email address will not be published.